Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జపాన్ మీదుగా క్షిపణి... కిమ్ (పిచ్చోడి) చేతిలో రాయిలా 'అణు బాంబు'

శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (21:10 IST)

Widgets Magazine

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ జపాన్ ప్రజలకు చుక్కలు చూపించారు. జపాన్‌లోని ఎరిమో, హోక్కైడో నగరాల్లో ఓ పబ్లిక్ అనౌన్స్‌మెంట్ జపాన్ ప్రజలను పరుగులు తీసేలా చేశాయి. అణు క్షిపణి వచ్చి పడనుందని.. అందరూ ఇళ్లల్లోకి పారిపోండనే మాటలు విన్న జపాన్ ప్రజలు వణుకుతో పరుగులు తీశారు. 
 
ఉత్తర కొరియా శుక్రవారం మరో క్షిపణి పరీక్షను నిర్వహించి, దాన్ని జపాన్ మీదుగా వదిలింది. ఈ సందర్భంగా జపాన్ ప్రజలను అలా అలెర్ట్ చేశారు. క్షిపణి జపాన్ మీదుగా వెళుతూ ఉండటాన్ని ఆ దేశ రాడార్లు ముందే పసిగట్టగా, హై అలర్ట్‌ను ప్రకటించారు. ఆ క్షిపణి జపాన్‌పై పడే ప్రమాదం ఉండటంతో లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలకు విషయాన్ని చేరవేశారు. దీంతో జనాలు పరుగులు తీశారు. 
 
అయితే ఉత్తర కొరియా తీరుపై జపాన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. పదేపదే తమ దేశం మీదుగా ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగిస్తుండటం.. అవి పసిఫిక్ మహా సముద్రంలో పడుతుండటాన్ని గమనించిన జపాన్.. ఇకపై కిమ్ జాంగ్‌ దూకుడుకు బ్రేక్ వేయాలనుకుంటోంది. ఆయన చేష్టలను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేసింది.
 
అయితే ఉత్తర కొరియా ప్రయోగించే క్షిపణులు జపాన్‌పై పడితే ఇక నగరాలు మాయమైపోతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై జపాన్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మరోవైపు రష్యా కూడా కిమ్ జాంగ్ చేష్టలపై మండిపడుతోంది. మొత్తమ్మీద అణు బాంబులు కిమ్ చేతిలో పిచ్చోడి చేతిలో రాయిలా మారాయి. వాటిని ఎటు విసిరాస్తాడోనన్న భయంతో ప్రపంచం బిక్కుబిక్కుమంటోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఏపీలో భూ కేటాయింపులు... కిమ్స్‌కు 40, పుల్లెల అకాడమీకి 12 ఎకరాలు... ఇంకా....

అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు భూముల కేటాయింపు, ధరలను ఆర్థిక ...

news

నేను 'గాడిదల కేటగిరీ' కిందకు వస్తా : ఆశారాం బాపు

దేశంలో ఉన్న వివాదాస్పద గురువుల్లో ఆశారాం బాపు ఒకరు. ఈయన వయసు 76 యేళ్లు. 2013లో ...

news

హలో బాబూ అటు కాదు ఇటు... ద్విచక్ర వాహనదారుడికి గవర్నర్ క్లాస్...

హైదరాబాద్: స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా ''స్వచ్చతా హై సేవా''ను శుక్రవారం నాడు ...

news

ఉ.కొరియా సమీపానికి డోనాల్డ్ ట్రంప్.. కిమ్ జాంగ్ ఉన్ దాడికి తెగబడతాడా?

అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గునమండిపోతోంది. ఈ రెండు దేశాల మధ్య ...

Widgets Magazine