Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కయ్యాలమారి ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం?

మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (06:24 IST)

Widgets Magazine
north korea missile

కయ్యాలమారి ఉత్తరకొరియా మరో క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సోమవారం ప్రకటించింది. ఇప్పటికే వరుస అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులను ఉ.కొరియా నెలకొల్పుతున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలను గుర్తించామని దక్షిణ కొరియా రక్షణశాఖ వెల్లడించింది. అది ఖండాంతర క్షిపణి అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది. ‘ఆదివారం నాటి అణు పరీక్ష తర్వాత మరో బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగానికి ఉత్తరకొరియా సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి’ అని దక్షిణకొరియా వివరించింది. 
 
అయితే క్షిపణి వివరాలు, ఎప్పుడు ప్రయోగిస్తారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తరకొరియా ఆదివారం మరో దురుసు చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్‌ బాంబును ఉత్తరకొరియా విజయవంతంగా పరీక్షించింది. ఆ దేశం అణు పరీక్ష నిర్వహించడం ఇది ఆరోసారి. 
 
కాగా.. ఈ విస్ఫోటనంతో చోటుచేసుకున్న భూకంపాన్ని బట్టి ఇప్పటివరకూ ఉత్తరకొరియా నిర్వహించిన అణు పరీక్షల్లో ఇదే శక్తిమంతమైందని స్పష్టమవుతోంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో ఈ బాంబును పరీక్షించింది. ఈ విస్ఫోటనం వల్ల వెలువడిన శక్తి 50 నుంచి 60 కిలోటన్నుల మధ్య ఉంటుందని దక్షిణకొరియా అంచనా వేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Predicts Launches New Missile South Korea Usa Deploys Defence North Korea Live Updates

Loading comments ...

తెలుగు వార్తలు

news

మా వద్ద పిచ్చి వేషాలు వేయొద్దు : దినకరన్‌కు సుప్రీం వార్నింగ్

అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు సుప్రీంకోర్టు గట్టివార్నింగ్ ఇచ్చింది. ...

news

నిర్మలా సీతారామన్ 'ఆవకాయ పచ్చడి'.. వీడియో వైరల్

నిర్మలా సీతారామన్. పుట్టింది తమిళనాడు రాష్ట్రంలో. విద్యాభ్యాసం చేసిన ఢిల్లీలో. కోడలిగా ...

news

127 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం: మంత్రి గంటా శ్రీనివాసరావు

అమరావతి: దిక్సూచిలా పనిచేసే ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తేనే మెరుగైన సమాజానికి బాటలు ...

news

ముగ్గురూ అమ్మాయిలే.. వారసుడు కావాలని భార్యనే చంపేశాడు..

తన భార్య మగపిల్లాడిని కనలేదనే కోపంతో భర్తే భార్య పట్ల కిరాతకంగా వ్యవహరించాడు. ఈ ఘటన ...

Widgets Magazine