గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2017 (16:50 IST)

అమెరికాలో ఉ.కొరియా బాంబు.. అగ్రనగరాలు ధ్వంసం.. ఉ.కొ వీడియో ప్రచారం

అగ్రరాజ్యం అమెరికాతో యుద్ధానికి ఉత్తర కొరియా సై అంటోంది. తాజాగా మరో కవ్వింపు చర్యకు పాల్పడింది. అమెరికాపై తాము క్షిపణులతో దాడి చేస్తే ఇలా ఉంటుందంటూ ఓ వీడియోను తయారు చేసి లీక్ చేసింది. ఉ.కొరియా వ్యవస్థ

అగ్రరాజ్యం అమెరికాతో యుద్ధానికి ఉత్తర కొరియా సై అంటోంది. తాజాగా మరో కవ్వింపు చర్యకు పాల్పడింది. అమెరికాపై తాము క్షిపణులతో దాడి చేస్తే ఇలా ఉంటుందంటూ ఓ వీడియోను తయారు చేసి లీక్ చేసింది. ఉ.కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌-2 సంగ్‌ గౌరవార్థం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ వీడియోను ప్రదర్శించారు. 
 
ఆ వీడియో ప్రకారం.. 'పసిఫిక్‌ సముద్రం మీదుగా అమెరికాపై వరుసపెట్టి ఉత్తరకొరియా క్షిపణులతో దాడి చేస్తుంది. ఆ తర్వాత ఓ పెద్ద బాంబును అమెరికాపై విసరుతుంది. దీంతో అగ్రరాజ్య నగరాలన్నీ పూర్తిగా ధ్వంసమవుతాయి. చివరగా.. అమెరికా జెండా కాలిపోయినట్లుగా ఉంటూ దానిపై శవపేటిక ఆకారం కనిపించడంతో వీడియో ముగుస్తుంది. వీడియో ప్రదర్శన అయిపోగానే.. ఉత్తరకొరియా మిలిటరీ అధికారులు కరతాళ ధ్వనులు మోగించారు. అది చూసిన ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఆనందంతో అభివాదం చేశారు.
 
అయితే ఈ వీడియో బయటకు రాలేదు. ఉత్తర కొరియా దేశ నిబంధనల ప్రకారం.. చాలా కొద్ది మందికి మాత్రమే ఇంటర్నెట్‌ సదుపాయం ఉంటుంది. అది కూడా ప్రభుత్వంతో అనుసంధానించి ఉండటంతో వీడియో బయటకు రాలేరు. ఉత్తర కొరియా ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న టీవీ ఛానళ్లు మాత్రం ఈ వీడియోను ప్రసారం చేసినట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు.