గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 మే 2016 (10:34 IST)

శత్రుదేశాలకు చుక్కలు చూపిస్తాడు.. వెన్నుచూపని వీరుడు కిమ్ జాంగ్: మీడియా

ఉత్తర కొరియా అధినేత కిమ్‌జాంగ్‌‌ అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో కిమ్‌జాంగ్‌ను ఆ దేశ మీడియా పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసింది. అంతేగాకుండా కిమ్‌జాంగ్‌ను సుప్రీమ్ లీడర్‌గా ప్రమోట్ చేసింది. అంతర్జాతీయంగా పలు దేశాలు ఎగుమతులను రద్దు చేసి అడ్డంకులు సృష్టించినా కిమ్‌జాంగ్ వెనక్కి తగ్గని దైవదూతగా కిమ్‌ను మీడియా పోల్చింది.
 
ఏకంగా 21వ శతాబ్ధపు ముద్దుబిడ్డగా పోల్చింది. ప్రజా రక్షకుడంటూ పొగడ్తలతో ముంచెత్తింది. దీనితో పాటు శత్రుదేశాలకు చుక్కలు చూపించగల నాయకుడిగా.. వెన్నుచూపని వీరుడిగా కీర్తించింది. ఇదిలా ఉంటే దక్షణ కొరియా ఏడో కాంగ్రెస్ గవర్నింగ్ వర్కర్స్ పార్టీ సమావేశం శుక్రవారం జరుగనుంది. 
 
ఈ సమావేశానికి కిమ్ జాంగ్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కిమ్‌జాంగ్‌ను పార్టీ సుప్రీమ్ హీరోగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా పార్టీ పొలిట్‌బ్యూరో అధ్యక్షుడిగా కిమ్‌జాంగ్‌ను ప్రకటించే ఛాన్సుందని తెలిసింది.