శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (17:08 IST)

యుద్ధ నౌకను ఒకే దెబ్బకు ధ్వంసం చేస్తాం : అమెరికాకు ఉ.కొరియా హెచ్చరిక

అమెరికాకు ఉత్తర కొరియా మరోమారు గట్టి హెచ్చరిక చేసింది. యుద్ధనౌకలను తీసుకొచ్చి తమ ముందు బల ప్రదర్శన చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. తాము తలచుకుంటే అమెరికా యుద్ధ నౌకను ఒక్క దెబ్బకు ముక్కల

అమెరికాకు ఉత్తర కొరియా మరోమారు గట్టి హెచ్చరిక చేసింది. యుద్ధనౌకలను తీసుకొచ్చి  తమ ముందు బల ప్రదర్శన చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. తాము తలచుకుంటే అమెరికా యుద్ధ నౌకను ఒక్క దెబ్బకు ముక్కలు చేస్తామంటూ హెచ్చరిక చేసింది.  
 
కాగా, కార్ల్ విన్సన్ అనే భారీ యుద్ధనౌక ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్ సముద్రంలో అమెరికా మొహరించివుంది. అలాగే, జపాన్‌కు చెందిన రెండు యుద్ధనౌకలు కూడా ఈ నౌకతతో జతకలిశాయి. ఇరు దేశాలు కలసి పశ్చిమ పసిఫిక్‌లో బలప్రదర్శన చేయనున్నాయి. 
 
అయితే, ఉ.కొరియా జలాల్లో మకాం వేయాలని... అవసరమైతే అదును చూసి దెబ్బకొట్టాలంటూ యుద్ధనౌకకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఉ.కొరియా గట్టి వార్నింగ్ ఇచ్చింది. 
 
ఒకే దెబ్బతో మీ యుద్ధనౌకను ధ్వంసం చేసి, సముద్రంలో ముంచేస్తామని... దీనికోసం తమ విప్లవ బలగాలు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది. ఉత్తర కొరియా తాజా హెచ్చరికతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.