Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమెరికాకు ముచ్చెమటలు : మూడు వారాల్లో మూడో క్షిపణి.. యేడాదిలో 12వ మిస్సైల్ టెస్ట్

మంగళవారం, 30 మే 2017 (12:06 IST)

Widgets Magazine

జి-7 దేశాల కూటమినే కాదు.. ప్రపంచ దేశాలను సైతం ఉత్తర కొరియా ఏమాత్రం పట్టించుకోవడం లేదు కదా వరుసగా క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తోంది. గత మూడు వారాల్లో మూడు క్షిపణులను ప్రయోగించగా, గత యేడాది కాలంలో మొత్తం 12 క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించింది. దీంతో అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 
 
అణుయుద్ధం మంచిది కాదని ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా ఉత్తరకొరియా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా 450 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల స్కడ్ తరహా బాలిస్టిక్‌ క్షిపణిని సోమవారం పరీక్షించింది. ఇది జపాన్ సముద్ర జలాల్లో పడింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
 
అమెరికా, దక్షిణకొరియా, జపాన్ దేశాలను రెచ్చగొడుతున్న ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ దుందుడుకు వైఖరితో ఆ దేశం వారం రోజుల వ్యవధిలో మూడు క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఇది ఈ ఏడాదిలో 12వ క్షిపణి పరీక్ష కావడం విశేషం. అమెరికాను రెచ్చగొట్టేందుకే కిమ్ జాంగ్ ఉన్ ఈ క్షిపణి పరీక్షను నిర్వహించినట్టు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పశువధ నిషేధంపై మమత ఫైర్: మోడీ చెప్పిందే ప్రజలు తినాలా? ఇదేంటి?

''పశు వధ నిషేధం''పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రజల ఆహార ...

news

భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు.. సౌదీలో షేక్‌కు అమ్మేశాడు!

దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. టిపుల్ తలాక్‌ను రద్దు చేయాలని ...

news

సస్పెండ్ చేస్తే ఇక ఇంటికే : యూపీ ప్రభుత్వ అధికారులకు సీఎం షాక్

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి, విధులకు డుమ్మాకొడుతూ, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడే ...

news

బీఫ్‌పై బ్యాన్ చేశారు.. బీర్ షాపును ప్రారంభించారు: యూపీ మహిళా మంత్రి నిర్వాకం.. సీఎం యోగి మండిపాటు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు బీఫ్‌పై నిషేధం విధించారు. మరోవైపు బీరు బారులను ...

Widgets Magazine