Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఉత్తర కొరియాను ఎలా నాశనం చేస్తామంటే... మాక్ డ్రిల్ నిర్వహించిన అమెరికా

బుధవారం, 31 మే 2017 (13:11 IST)

Widgets Magazine
pentagon

ఉత్తర కొరియాను ఎలా నాశనం చేస్తామనే అంశంపై ఆమెరికా మాక్ డ్రిల్ నిర్వహించింది. తమ జోలికి వస్తే అణు బాంబు ప్రయోగిస్తామంటూ అమెరికాను ఉత్తర కొరియా హెచ్చరిస్తూ.. రాత్రుళ్లు నిద్రలేకుండా చేస్తోంది. ఒక వేళ ఉత్తర కొరియా బెదిరించినట్టుగా అణుదాడి చేస్తే ఆ దాడిని తిప్పికొట్టడమే కాకుండా, ఉత్తర కొరియాను ఎలా నాశనం చేస్తామో మాక్ డ్రిల్ ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపించింది. 
 
ఉత్తర కొరియా వద్ద ఉన్న ఖండాంతర క్షిపణులతో పోలిస్తే, మరింత శక్తిమంతమైన క్షిపణిని పసిఫిక్ మహాసముద్రంపై ప్రయోగించి, దాన్ని ఆకాశంలోనే తుత్తునియలు చేసే పరీక్షలో విజయవంతమైంది. గ్రౌండ్ ఆధారిత మిడ్-కోర్స్ డిఫెన్స్ సిస్టమ్‌ను వాడుతూ, ఐదు అడుగుల పొడవైన 'కిల్ వెహికిల్'ను ప్రయోగించి, ఐసీబీఎం (ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్)ను ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. 
 
ఈ మాక్ టెస్టును మార్షల్ దీవుల్లోని రొనాల్డ్ రీగన్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ టెస్ట్ సైట్ నుంచి ప్రయోగించామని, దాన్ని అడ్డుకునే కిల్ వెహికిల్‌ను కాలిఫోర్నియాలోని వాండెన్ బర్గ్ ఎయిర్‌ఫోర్స్ బేస్ స్టేషన్ నుంచి ప్రయోగించామని తెలిపారు. కాగా, ఈ పరీక్ష మంగళవారం ఉదయం జరిపామని, తమ సత్తా ఏంటన్న విషయాన్ని నార్త్ కొరియాకు గుర్తు చేసేందుకే ఇలా చేశామని నేవీ కెప్టెన్, పెంటగాన్ అధికార ప్రతినిధి జెఫ్ డేవిస్ వ్యాఖ్యానించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దాసరి చరమాంకంలో మాయని మచ్చగా నిలిచిపోయింది.. అదొక్కటే?

ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణ రావు మంగళవారం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ...

news

పత్రికారంగంలో కొత్త 'ఉదయం'.. ఓ సంచలనం... ఉద్యోగులతో కలిసే భోజనం..

తెలుగు పత్రికారంగంలో ఒక సంచలనం ‘ఉదయం’ దినపత్రిక. సినీ దర్శకుడిగా ఉంటూనే రాజకీయాలు, ...

news

ముంబై తరహా ఉగ్రదాడికి ప్లాన్.. పాక్ నుంచి 20 మంది ముష్కరులు.. నిఘా వర్గాల హెచ్చరిక

దేశవాణిజ్య రాజధాని ముంబైలో మరోమారు మారణహోమం సృష్టించేందుకు పాకిస్థాన్ ప్లాన్ వేసినట్టు ...

news

సెలవు తీసుకున్న చిత్రసీమ అంబేద్కరుడు..ఈ సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు

నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు సినిమా, సామాజిక, రాజకీయ రంగాల్లో అడుగడుగునా తన పాద ముద్ర ...

Widgets Magazine