గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2015 (17:36 IST)

అమెరికా న్యూయార్క్ క్రిమినల్ కోర్టు జడ్జిగా చెన్నై వాసి!

అమెరికాలో భారత సంతతికి చెందిన ఒక మహిళ జడ్జిగా ఎంపికై సరికొత్త రికార్డును సృష్టించారు. చెన్నైకి చెందిన రాజరాజేశ్వరి పదహారు సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ఉన్న ఆమె గత 16 సంవత్సరాలుగా రిచమండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ అటార్నీగా పనిచేస్తున్నారు. 
 
ఈమె న్యూయార్క్‌లోని క్రిమినల్ కోర్టు జడ్జిగా నామినేట్ అయ్యారు. అమెరికాలో న్యాయమూర్తిగా ఎంపికైన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. న్యాయశాస్త్రంతో పాటు భరతనాట్యం, కూచిపూడి నృత్యాలలో ప్రావీణ్యం ఉన్న ఆమె, తన తల్లి పద్మారామనాథన్ పేరిట ప్రారంభించిన డాన్స్ అకాడమీ తరపున అప్పుడప్పుడూ ప్రదర్శనలు కూడా ఇస్తూ మంచి పేరు కూడా సంపాదించుకున్నారు.