శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (17:21 IST)

ఆర్థిక సంక్షోభంలో గ్రీస్... చేతులు కలిపిన అమెరికా, ఫ్రాన్స్..

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన గ్రీస్‌ దేశాన్ని గట్టెక్కించేందుకు అగ్రరాజ్యాలు అమెరికా, ఫ్రాన్స్ దేశాధినేతలు చేతులు కలిపారు. గ్రీస్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు. ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండే‌కు ఫోన్ చేసి గ్రీస్ సంక్షోభ పరిష్కార చర్యలపై చర్చించినట్టు వైట్‌హౌస్ అధికారులు తెలిపారు.
 
ఈ సందర్భంగా వారు గ్రీస్‌కు అందించాల్సిన సాయంపై ఒక అవగాహనకు వచ్చారన్నారు. దీంతో ఫ్రాన్స్, అమెరికాలు సంయుక్తంగా కలిసి గ్రీస్‌ను సంక్షోభం నుంచి బయటకు తెస్తాయని వారు వెల్లడించారు. అదేవిధంగా ఫ్రాన్స్‌లో జరిగిన ఉగ్రదాడిపై సంతాపం వ్యక్తం చేశారని, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఫ్రాన్స్, అమెరికా కలిసి పనిచేస్తాయని అధికారులు తెలిపారు.