శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2016 (13:56 IST)

మొత్తం ఇస్లాం సమాజాన్నే శంకించడం తప్పు: బరాక్ ఒబామా

ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడే కొందరు దుండగుల చర్యలకు మొత్తం ఇస్లాం సమాజాన్నే శంకించడం తప్పని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యల్ని ఒబామా తప్పుబట్టారు. ఇంకా దేశ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని ఒబామా పరోక్షంగా ఖండించారు.
 
మేరీల్యాండ్ ప్రాంతంలోని బాల్టిమోర్ మసీద్‌ను అధ్యక్షుడి హోదాలో తొలిసారి సందర్శించిన సందర్భంగా ఒబామా మాట్లాడుతూ.. పారిస్, కాలిఫోర్నియా ఉగ్రదాడుల తర్వాత అమెరికన్ ముస్లింలపై వివక్ష పెరుగుతోందన్నారు. ముస్లిం వర్గానికి చెందిన ముఖ్యనేతలతో ఒబామా భేటీ అయినట్లు తెలిపారు.

అమెరికన్ ముస్లింలపై వివక్ష చూపడం అన్ని మత విశ్వాసాలపైనా దాడి చేయడమేనని చెప్పారు. ఇలా ఒక వర్గం ప్రజలను అనుమానంతో చూడటం అమెరికా సామాజిక నిర్మాణానికి విఘాతం కలిగించడమేనని ఘాటుగా స్పందించారు.