గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 జులై 2015 (11:58 IST)

ఒబామా కోసం బామ్మ ఎదురుచూపులు: చేపలు, చికెన్‌తో వంటకాల లిస్ట్ రెడీ

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కోసం నాయనమ్మ వేయి కనులతో ఎదురుచూస్తున్నారు. ఒబామా త్వరలో కెన్యాలో పర్యటించనున్నారు. ఒబామా తండ్రి స్వదేశం కెన్యా కావడంతో మమా సారా కెన్యాలోనే ఉన్నారు. ఈమె ఒబామా తాతయ్య హుస్సేన్ ఒన్యాంగోకు మూడో భార్య కావడం గమనార్హం. 
 
రక్తసంబంధం లేకపోయినా ఒబామా కోసం.. ఆయన బామ్మా అనే పిలుపు కోసం.. సారా ఎదురుచూస్తున్నారట. ఒబామా వస్తే ఆయన కోసం ఏమేం వంటకాలు సిద్ధం చేయాలో ఇప్పటినుంచే సిద్ధం చేసుకుంటున్నారట. తన మనవడికి కెన్యా సంప్రదాయ వంటకాలన్నీ తయారు చేస్తానని సారా చెప్తున్నారు. 
 
ఈ క్రమంలో చేపలు, చికెన్, మొక్కజొన్న అంబలి... ఇలా పెద్ద లిస్టును సారా సిద్ధం చేసుకున్నారట. "ఒబామా సెనేటర్ అయితేనేమి? ప్రెసిడెంట్ అయితేనేమి? నేను అతని కోసం ఏం వండానో అవన్నీ తింటాడు" అని పేర్కొంది. కోగెలో ప్రాంతానికి వెళ్లి పూర్వీకులకు నివాళి అర్పించమని ఒబామాకు చెప్పానని, అయితే, అతను రాజధాని నైరోబి వెలుపలి ప్రాంతాలకు వెళతాడో లేదో స్పష్టత లేదన్నారు.