శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (09:27 IST)

సత్య నాదెళ్లను వరించిన అరుదైన అవార్డు.. ‘ఛాంపియన్ ఆప్ ఛేంజ్’కు ఎంపిక..!

అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ రంగంలో రికార్డులు సృష్టిస్తున్న తెలుగు తేజం, మైక్రోసాఫ్ట సీఈఓ సత్య నాదెళ్లను మరో అరుదైన అవార్డు వరించింది. అమెరికా అధ్యక్ష భవనం ప్రకటించే ‘ఛాంపియన్ ఆప్ ఛేంజ్’ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. 
 
సంస్థలు, సమాజానికి మెరుగైన సేవలు అందించేందుకు విశేష కృషి చేసిన వారికి వైట్ హౌస్ అందించే ‘ఛాంపియన్ ఆప్ ఛేంజ్’ అవార్డు ఇప్పుడు మన సత్య నాదెళ్లకు తక్కింది. మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం సత్య నాదెళ్ల పలు విప్లవాత్మక చర్యలు చేపట్టారు. 
 
ఆ సంస్థకు చెందిన అమెరికా కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వచ్చే ఏడాది నుంచి ఏటా 15 రోజుల వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ తరహా చర్యలతో ఉద్యోగుల సంక్షేమం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న సత్య నాదెళ్లకు వైట్ హౌస్ ‘ఛాంపియన్ ఆప్ ఛేంజ్’ అవార్డు ప్రకటించింది. 
 
ఇంకో విశేషం ఏమిటంటే ఈ అవార్డును అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా అందించనున్నట్టు సమాచారం.