అక్టోబర్ 15: కలాం పుట్టిన రోజు ఇక అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం!

Selvi| Last Updated: మంగళవారం, 28 జులై 2015 (15:18 IST)
భారత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌కు ఐక్యరాజ్యసమితి ఘన నివాళి అర్పించింది. అబ్దుల్ కలాం పుట్టిన రోజైన అక్టోబర్ 15వ తేదీని ప్రతి ఏడాది
'అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం'గా నిర్వహించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. అత్యున్నత రాష్ట్రపతి పదవిలో ఉన్న సమయంలో కూడా అనుక్షణం విద్యార్థుల్లో విజ్ఞానాన్ని నింపడానికి కలాం ప్రయత్నించారని ఐక్యరాజ్యసమితి కీర్తించింది. భారత రాష్ట్రపతిగా ఆయన ప్రపంచ శాంతి కోసం పరితపించారని ఐక్యరాజ్యసమితి కొనియాడింది.

ఇకపోతే... కలాం సొంతూరులో అంత్యక్రియల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఏపీజే అబ్దుల్ కలాం భౌతిక కాయానికి బుధవారం ఆయన సొంతూరు రామేశ్వరంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రామనాథపురం జిల్లా కలెక్టర్ రామేశ్వరానికి వెళ్లి కలాం బంధువులతో భేటీ అయ్యారు. కలాం అంత్యక్రియలకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులతో కలెక్టర్ చర్చించినట్లు సమాచారం.దీనిపై మరింత చదవండి :