శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (12:01 IST)

అమెరికాలో కూలిన విమానం : ఐదుగురు మృతి

అమెరికాలో విమానం కూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఉత్తర డెన్వర్‌లో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. 
 
పైపర్ -46 విమానం ఈరీ మున్సిపల్ విమానాశ్రయానికి సమీపంలో కూలిపోయిందని తెలిపారు. ముగ్గురు సంఘటనా స్థలంలోనే చనిపోయాగా, ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందారు. 
 
ఆరుగురు ప్రయాణించడానికి వీలుగా ఉండే ఈ విమానం కిందకు దిగుతున్నప్పుడు కూలిందా లేక పైకి ఎగురుతున్నప్పడు కూలిందా అనేది తెలియలేదని అధికారులు తెలిపారు.