Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కొంపముంచిన చైనా బామ్మ... దెబ్బకు విమానం ఆగిపోయింది.

హైదరాబాద్, బుధవారం, 28 జూన్ 2017 (05:54 IST)

Widgets Magazine
easyjet flight

నమ్మకాలు, విశ్వాసాలు అనేవి మనుషులకు మాత్రమే పరిమితం చేసుకునేంతవరకు ఎవరికీ ఏ ఇబ్బందీ లేదు. కానీ పదిమంది మేలు కోరేవి అయినా సరే మన నమ్మకాలను బలవంతంగా మనుషులు మీద కాదు విమానంపైన రుద్దితే ఎలా మరి. అది ఎంత పెద్ద నేరమో తెలియని ఇప్పుడు చైనాలో అరదండాలు తగిలించుకోవలసి వస్తోంది. ఆమె చేసిన పనల్లా ఏమిటంటే. విమాన ప్రయాణంలో ప్రమాదాలు జరగకూడదని  విమానం ఇంజన్ లోనే నాణాలు పడేయడం. 
 
 
అతీత శక్తులపై విపరీతమైన నమ్మకాన్ని విమానంపై చూపిందా చైనా బామ్మ. ఆ దెబ్బకు విమాన ప్రయాణమే ఆగిపోయింది. ఇంతకు ఏం  చేసిందంటే..షాంఘై ఫుడోంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గంగ్జౌ పట్టణానికి వెళ్లేందుకు విమానం సిద్ధంగా ఉంది. 80 ఏళ్ల బామ్మ, ఆమె భర్త, కుమార్తె, అల్లుడు కలిసి విమానం ఎక్కేందుకు వచ్చారు. విమానం ఎక్కేందుకు వచ్చిన బామ్మకు అతీతశక్తులపై విపరీతమైన నమ్మకం. 
 
దీంతో ప్రయాణంలో తమకెటువంటి హానీ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో బామ్మ తాపీగా నడుచుకుంటూ వెళ్లి ఇంజిన్‌లోకి ఓ తొమ్మిది నాణేలను విసిరేసింది. బామ్మ చేసిన పని చూసిన ఓ ప్రయాణికుడు ఆ విషయాన్ని విమాన సిబ్బందికి చెప్పాడు. దీంతో విమానాన్ని ఆపేశారు.బామ్మ చేసిన పనికి విమానం ఇంజిన్ విప్పి మరమ్మతు చేయాల్సి వచ్చింది. అప్పటికే విమానంలో ఎక్కి కూర్చున్న 150 మందిని దింపేశారు. 
 
అనంతరం ఇంజిన్ విప్పి పూర్తిగా గాలించగా 8 నాణేలు దొరికాయి. మరికొంత సేపు గాలించగా ఇంజిన్‌లో ఇరుక్కుపోయిన మరో నాణెం కనిపించడంతో విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విమానాన్ని పంపించిన అధికారులు బామ్మను మాత్రం అదుపులోకి తీసుకున్నారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అప్పుడు వాన్నా క్రై... ఇప్పుడు పెట్యా..ఏం వైరస్‌లో.. ప్రపంచాన్నే ముంచుతున్నాయి

కనిపించని ప్రాణాంతక వైరస్ మనుషుల్లో దూరితే జరిగే విధ్వంసం సమాజాలనే అతలాకుతలం చేస్తుందని ...

news

మెడికల్‌ ల్యాబ్‌లో పుట్టిన మదపిచ్చి.. టెక్నీషియన్‌పైనే అత్యాచారయత్నం

ఆడదాని జూడ బ్రహ్మకైన బుట్టు రిమ్మతెగులు అని ప్రబంధ కవి ఊరికే అనలేదు. ఆడది ఇంటా బయటా ...

news

ఏకీకృత సర్వీసుల సాధన ఉత్తర్వులపై సీఎంకు ఉపాధ్యాయ సంఘాల కృతజ్ఞతలు

అమరావతి : ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసుల సాధన కోసం పోరాటం చేస్తున్న టీచర్లకు మద్దతునివ్వడంతో ...

news

ఏపీ రైతులూ... మీ సమస్యల చెప్పుకునేందుకు డయల్ యువర్ సీఈఓ(ఏపీ)..

రైతు సాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వాహణాధికారి మరియు ప్రత్యేక వ్యవసాయ కమీషనర్ డా. ఎం.హరి ...

Widgets Magazine