Widgets Magazine
Widgets Magazine

సాయంకాలానా... సాగరతీరానా... : బీచ్‌లో మోడీ - నెతన్యాహు (Video)

శుక్రవారం, 7 జులై 2017 (15:05 IST)

Widgets Magazine
israel tour

సాయంకాలానా.. సాగ‌ర‌తీరానా..
సంధ్యా సూర్యుడిలా నువ్వు.. నేనూ..
వేస‌వి కాలానా.. వెన్న‌ల స‌మ‌యానా...
తారా చంద్రుడిలా నువ్వు.. నేనూ యూ అండ్ మీ...
ఈ పాట మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం "ఖైదీ నంబర్ 150"లోనిది. మంచి హిట్ సాంగ్ కూడా. కాజల్‌తో కలిసి చిరంజీవి పాడిన డ్యూయెట్ సాంగ్. 
 
ఇపుడు ఈ పాటను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహులకు ఆపాదించవచ్చు. ఎందుకంటే వీరిద్దరూ కలిసి ఇజ్రాయేల్‌లోని డోర్ బీచ్‌లో వివహరించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయేల్ దేశంలో మూడు రోజుల పాటు పర్యటించారు. ఈ పర్యటన చివరిరోజైన గురువారం ఆయన సముద్రతీరంలో విహరించారు. ఆయనతో పాటు ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు కూడా ఉన్నారు. వీరిద్దరూ కొద్దిసేపు తమతమ హోదాలను పక్కనబెట్టి, చిన్నపిల్లల్లా మారిపోయారు. కాళ్లకు చెప్పుల్లేకుండా సముద్ర తీరంలో కాసేపు సరదాగా విహరించారు. మోడీ తన ప్యాంటు తడవకుండా పైకెత్తి మరీపట్టుకుని నీటిలో ఉత్సాహంగా అడుగులు వేశారు. 
 
ఈ సముద్రతీర పర్యటనపై మోడీ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ.. స్నేహితులతో కలసి సముద్ర తీరానికి వెళ్లడానికి మించిన ఆనందం మరొకటి ఉండదు. ఇక కాళ్లకు చెప్పుల్లేకుండా తామిద్దరం ఉన్న ఫోటోను పెద్దది చేయించి మోడీకి గిఫ్ట్‌గా ఇచ్చిన నెతన్యాహూ, "మీ చారిత్రాత్మక పర్యటనలో మన స్నేహానికి గుర్తుగా..." అని దానిపై ఆటోగ్రాఫ్ చేశారు. వారిద్దరూ బీచ్‌లో ఉన్న వీడియోను మీరూ తిలకించండి. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

విత్తనాలు, ఎరువులు, రుణాలిస్తున్నాం... ‘‘పొలం పిలుస్తోంది’’... ముఖ్యమంత్రి చంద్రబాబు

వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ...

news

అపుడు పెళ్లి కాకుండానే తల్లి అయింది.. ఇపుడు అవివాహితగా ప్రకటించాలని కోర్టుకెక్కింది!

బిడ్డకు తల్లి అయిన ఓ మహిళ... తనను అవివాహితగా ప్రకటించాలని కోరుతూ కోర్టుకెక్కింది. పైగా, ...

news

నాడు చేసిన తప్పుకు ఇపుడు మథనపడుతున్న కాంగ్రెస్... అందుకే ఆమె అడుగుపెట్టలేదు

ఎవరో కొంతమంది మాటలు విని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ముక్కలు చేసింది. 2014లో ...

news

నా నగ్న ఫోటోలు పంపుతున్నా.. వాటిని ఎవరికైనా విక్రయించి 'డ్రగ్స్' కొనివ్వరా... ప్లీజ్

హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్ దందా ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ...