మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 జులై 2014 (11:38 IST)

26/11 కేసు: విచారణను వాయిదా వేసిన పాకిస్థాన్ కోర్టు

26/11 కేసును పాకిస్థాన్ కోర్టు వాయిదా వేసింది. భారత ప్రభుత్వం శుక్రవారం పాకిస్తాన్ డిప్యూటీ హైకమిషనర్‌ను పిలిపించి, పాకిస్తాన్‌లో ముంబయి ఉగ్రవాద దాడుల కేసు విచారణను వాయిదా వేసినట్లు వచ్చిన వార్తలపై తీవ్ర నిరసన తెలియజేసింది. 
 
ముంబయి దాడులకు సంబంధించి ఏడుగురు నిందితులపై పెట్టిన కేసును విచారిస్తున్న పాక్ యాంటీ టెర్రరిస్టు కోర్టు జడ్జి వేసవి సెలవులపై వెళ్లినందున బుధవారం ఈ కేసు విచారణను సెప్టెంబర్ 3 దాకా వాయిదా వేయడంతో భారత ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించింది. ఈ కేసు విచారణ వాయిదా పడ్డం వరసగా ఇది ఏడోసారి కావడం గమనార్హం.
 
2008 నవంబర్‌లో 166 మంది ప్రాణాలను బలిగొన్న ముంబయి ఉగ్రవాద దాడులకు పథక రచన, నిధుల సమీకరణ, అమలు జరిపారన్న ఆరోపణలపై పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీవుర్ రెహమాన్ సహా ఆ సంస్థకు చెందిన ఏడుగురు ఉగ్రవాదులపై పాక్ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.