మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 మే 2017 (11:17 IST)

భారత్‌లో విధ్వంసానికి పాక్ ఉగ్రసంస్థల కుట్ర : అమెరికా హెచ్చరిక

భారత్‌లో పేలుళ్ళతో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్ర సంస్థలు కుట్రపన్నాయని అమెరికా నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ కుట్ర కూడా పాక్ భూభాగంలోనే రచించారని యూఎస్ నిఘా సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించా

భారత్‌లో పేలుళ్ళతో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్ర సంస్థలు కుట్రపన్నాయని అమెరికా నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ కుట్ర కూడా పాక్ భూభాగంలోనే రచించారని యూఎస్ నిఘా సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అలాగే, ఉగ్రవాదాలను తుదముట్టించడంలో ఇస్లామాబాద్ విఫలమైందని ఆయన ఆరోపించారు. 
 
'ప్రపంచవ్యాప్త ముప్పు' అనే అంశంపై ఇంటెలిజెన్స్‌కు చెందిన సెనేట్ కమిటీ సభ్యుల సమావేశంలో నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ డేనియల్ కోట్స్ మాట్లాడుతూ, ఉగ్రసంస్థల దాడుల వల్ల ఇండియా, అఫ్గనిస్థాన్‌లోని అమెరికా ప్రయోజనాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. అమెరికా, మిత్ర దేశాలు సైనిక సహాయం పెంచినప్పటికీ 2018 నాటికి అఫ్గనిస్థాన్‌లో రాజకీయ, భద్రతా పరిస్థితి క్షీణించిపోయే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేసినట్టు ఆయన చెప్పారు. 
 
'పలు ప్రపంచ దేశాలకు భారత్ సన్నిహితమవుతూ, అమెరికాతో సంబంధాలు మరింత బలోపేతం అవుతుండటంతో అంతర్జాతీయంగా హోదాను పెంచుకుంటూ పోతోంది. దీంతో అంతర్జాతీయంగా తాము ఒంటరి అయ్యే అవకాశం ఉందని పాక్ ఆందోళన చెందుతోంది' అని అన్నారు. పాక్ ఒంటరి కాకుండా ఉండేదుకు చైనాకు బాగా దగ్గరయ్యే అవకాశాలున్నాయన్నారు. తర్వారా హిందూ మహాసముద్రంపై బీజింగ్ తన పట్టును పెంచుకునేందుకు ప్రయత్నాలు జరగవచ్చని కోట్స్ వివరించారు.