శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PYR
Last Modified: గురువారం, 29 జనవరి 2015 (07:26 IST)

అమెరికా-భారత్ అణు ఒప్పందంతో అస్థిరతే.. : పాక్

ఆ రెండు దేశాల మధ్య అణు ఒప్పందం కారణంగా దక్షిణాసియాలో అస్థిరత ఏర్పడుతుందని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదే జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ - అమెరికాల మధ్య అణు ఒప్పందాన్ని రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం అమలుచేయటం వలన ఈ ప్రాంతానికి హానికరమని చెప్పారు. 
 
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన తర్వాత పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వివరాల కోసం ఆరా తీశారు. బుధవారం పాక్ ప్రధాని కార్యాలయంలో భారత్‌లో పాక్ హైకమిషనర్ అబ్దుల్‌బాసిత్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటనకు సంబంధించిన వివరాలను సేకరించినట్లు సమాచారం. అయితే పైకి మాత్రం పాక్-భారత్ సంబంధాలను షరీఫ్‌కి వివరించినట్లు వెల్లడించారు.
 
భారత్‌తో పరస్పర గౌరవం, సార్వభౌమత్వం కోరుకుంటున్నామని  వెల్లడించారు. మొత్తంపై అమెరికాతో అణు ఒప్పందం ఇటు చైనా, అటు పాకిస్తాన్ దేశాలకు గుండెల్లో దడ పుట్టిస్తోంది.