మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 29 నవంబరు 2016 (19:54 IST)

చింత చచ్చినా పులుపు చావలా... పదవీ విరమణ చేస్తూ భారత్‌కు వార్నింగ్... పాక్ ఆర్మీ చీఫ్

మన పెద్దలు కొంతమంది చేసే పనులు, మాట్లాడే మాటలను బట్టి సామెతలు చెప్పారు. పాకిస్తాన్ రిటైర్డ్ ఆర్మీ చీఫ్... అంటే నిన్నటివరకూ అతడే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన రహీల్ షరీఫ్ మంగళవారం పదవీ విరమణ చేశారు. పోతూపోతూ ఏమీ మాట్లాడకుండా వెళితే పట్టించుకోరు అని అనుకు

మన పెద్దలు కొంతమంది చేసే పనులు, మాట్లాడే మాటలను బట్టి సామెతలు చెప్పారు. పాకిస్తాన్ రిటైర్డ్ ఆర్మీ చీఫ్... అంటే నిన్నటివరకూ అతడే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన రహీల్ షరీఫ్ మంగళవారం పదవీ విరమణ చేశారు. పోతూపోతూ ఏమీ మాట్లాడకుండా వెళితే పట్టించుకోరు అని అనుకున్నాడో ఏమోగానీ, భారతదేశానికి వార్నింగ్ ఇచ్చాడు. 
 
ఇంతకీ ఆయన ఇచ్చిన వార్నింగ్ కాశ్మీర్ గురించి. కాశ్మీర్ ఉద్రిక్తతల విషయంలో పాక్ సంయమనం పాటిస్తుండటాన్ని బలహీనంగా భావించవద్దనీ, అలా అనుకుంటే భారతదేశం పొరబడినట్లేనని అన్నారు. పెచ్చుమీరితే ప్రమాదకరంగా పాకిస్తాన్ మారుతుందని హెచ్చరించారు. పాక్ ఆక్రమిత కాశ్మీరులో భారత్ చర్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత... పదవీ విరమణ చేసి బాధ్యతలను కొత్త ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వాకు అప్పగించారు. మరి ఈయన ఏం మాట్లాడుతారో చూడాలి.