శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (05:24 IST)

సైన్యాన్ని రాజకీయాలకు దూరంగా పెట్టడంలో భారత్ ఆదర్శం: పాక్ ఆర్మీ ఛీఫ్

మొత్తం మీద పాక్ సైన్యానికి ఒక విషయం చాలా లేటుగా బోధపడినట్లుంది. సైన్యాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం ఎంత పొరపాటో పాక్ సైన్యాధికార వర్గానికే అర్థమైనట్లుంది. దీంతో నిత్యం యుద్ధానికి దిగే తమ పొరుగు ప్రత్యర్థి భారత్‌ను చూసైనా నేర్చుకోవాలని ఉన్నతాధికారులకే క

మొత్తం మీద పాక్ సైన్యానికి ఒక విషయం చాలా లేటుగా బోధపడినట్లుంది. సైన్యాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం ఎంత పొరపాటో పాక్ సైన్యాధికార వర్గానికే అర్థమైనట్లుంది. దీంతో నిత్యం యుద్ధానికి దిగే తమ పొరుగు ప్రత్యర్థి భారత్‌ను చూసైనా నేర్చుకోవాలని ఉన్నతాధికారులకే క్లాస్ పీకుతోంది. ఇన్నాళ్లకు భారత్ ఒక విషయంలో పాక్ సైన్యానికి ఆదర్శం కావడం గొప్పే మరి.
 
పాకిస్తాన్‌లో సైన్యాన్ని రాజకీయాలకి దూరంగా పెట్టాలని, ఆ విషయంలో మనం భారత్‌ని చూసి ఎంతో నేర్చుకోవాలని పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జావెద్‌ బజ్వా అన్నారు.  మంగళవారం ఇస్లామాబాద్‌లో పాక్‌ ఆర్మీ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో బజ్వా  ఈ మాటలు అన్నారు. 
 
‘సైన్యాన్ని ప్రభుత్వం నడపాల్సిన పని లేదు. దాని పరిధిలో అది పని చేస్తే చాలు’ అని పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ వ్యాఖ్యానించారని పాకిస్థాన్‌ న్యూస్‌ ఎజెన్సీ వెల్లడించింది. పాక్ సైనికులంతా స్టీవెన్‌ అనే రచయిత రచించిన ‘ఆర్మీ అండ్‌ నేషన్‌’ పుస్తకాన్ని చదవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారని వెల్లడించింది. ప్రభుత్వం, ఆర్మీ మధ్య సహకారం ఉండాలి కానీ పోటీ ఉండకూదడని బజ్వా అన్నారు.
 
పాక్ సైన్యానికేమో గానీ భారతీయులుగా మనకు ఈ మాటలు ఎంత  సమ్మగా ఉన్నాయో మరి.