శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2015 (11:02 IST)

ఇసిస్‌పై నిషేధం విధించిన పాకిస్థాన్ .. పాక్‌కు అమెరికా హెలికాఫ్టర్లు

ఉన్మాద, అత్యంత పాశవిక చర్యలతో ప్రపంచానికి సవాలుగా మారిన ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) సంస్థపై పాకిస్థాన్ నిషేధించింది. ‘ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రసంస్థపై పాకిస్థాన్‌లో నిషేధం విధిస్తున్నాం’’ అని ఆ దేశ అంతర్గత భద్రతశాఖ ప్రకటించింది. 
 
తమ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్‌, ఆఫ్గనిస్థాన్‌లోని గిరిజన ప్రాంతాలపై పట్టుకోసం ఇసిస్ ఇప్పటికే అనేక విధాల యత్నిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా పాకిస్థాన్ ఇసిస్‌పై ఉక్కుపాదం మోపాలని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. 
 
మరోవైపు ఉగ్రవాదంపై పోరుకోసం పాకిస్థాన్‌కు సైనిక్‌ హెలికాప్టర్లను అందించాలని అమెరికా నిర్ణయించింది. ఉగ్రవాదుల ఏరివేత చర్యల్లో భాగంగా అమెరికాకు చెందిన మానవరహిత విమానాలు ఇప్పటికే ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర దాడులు జరుపుతున్న విషయం తెల్సిందే.