శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 29 జులై 2017 (17:41 IST)

పాకిస్థాన్‌లో ఫేస్‌బుక్‌పై నిషేధం...

పాకిస్థాన్‌లో ఫేస్‌బుక్‌పై నిషేధం విధించనుంది. దైవ దూషణ, చట్ట విరుద్ధ వ్యాఖ్యలు వేగంగా ప్రజల్లోకి చేరేందుకు కారణమవుతుందన్నకారణంతో సామాజిక మాధ్యమంపై నిషేధించాలని పాకిస్థాన్ ప్రభుత్వం యోచిస్తోంది.

పాకిస్థాన్‌లో ఫేస్‌బుక్‌పై నిషేధం విధించనుంది. దైవ దూషణ, చట్ట విరుద్ధ వ్యాఖ్యలు వేగంగా ప్రజల్లోకి చేరేందుకు కారణమవుతుందన్నకారణంతో సామాజిక మాధ్యమంపై నిషేధించాలని పాకిస్థాన్ ప్రభుత్వం యోచిస్తోంది. కొత్తగా ఫేస్‌బుక్ ఖాతాను తెరిచే వారు తమ ఫోన్ నంబరును లింక్ చేయడం తప్పనిసరి చేయాలన్నారు. 
 
ఫోన్ నంబర్లను అనుసంధానించడం వల్ల ఖాతాదారుల వివరాలు సులభంగా గుర్తించే వీలుంటుందన్నారు. అయితే పాక్ డిమాండ్‌‌ను ఫేస్‌బుక్ తిరస్కరించింది. ఫేస్‌బుక్‌లో అకౌంట్ తెరిచేందుకు ఈ-మెయిల్ అడ్రస్ ఉంటే సరిపోతుందన్నారు. ఫేస్‌బుక్ సమాధానాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న పాక్ ప్రభుత్వం వచ్చే యేడాది నాటికి దానిని నిషేధించాలని యోచిస్తోంది. దైవదూషణకు సంబంధించిన కామెంట్లపై ఫేస్‌బుక్ తొలగించకపోతే దానిని వేటేయాలని చూస్తున్నట్టు సమాచారం.