శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 28 సెప్టెంబరు 2016 (19:35 IST)

భారత్ మమ్మల్ని 'బికారి'ని చేస్తుందేమో? కాపాడండి మహాప్రభో... పాక్ మొర... ఎక్కడ?

పాకిస్తాన్ దేశంపై ఇప్పటివరకూ భారతదేశం ఉక్కుపాదం మోపింది చాలా చాలా తక్కువనే చెప్పాలి. యూరి దాడితో భారతదేశం యావత్తూ పాకిస్తాన్ పైన యుద్ధం చేయాల్సిందే... వారి పీచమణచాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో పాకిస్తాన్ ఇపుడు బెంబేలెత్తిపోతోంది. దేశ ప్రజలు

పాకిస్తాన్ దేశంపై ఇప్పటివరకూ భారతదేశం ఉక్కుపాదం మోపింది చాలా చాలా తక్కువనే చెప్పాలి. యూరి దాడితో భారతదేశం యావత్తూ పాకిస్తాన్ పైన యుద్ధం చేయాల్సిందే... వారి పీచమణచాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో పాకిస్తాన్ ఇపుడు బెంబేలెత్తిపోతోంది. దేశ ప్రజలు సాధారణంగా యుద్ధాన్ని కోరుకోరు. ఎంతో కడుపు మండితేకానీ అలాంటి నిర్ణయానికి వస్తారు. ఇప్పుడు భారతదేశ ప్రజలు పాకిస్తాన్ ఉగ్ర కోరలు పీకాల్సిందేనని అంటున్నారు. 
 
ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి మోదీ సర్కార్ పాకిస్తాన్ పైన పరోక్షంగా ఒత్తిడి పెంచడం ద్వారా ఆ దేశాన్ని దారిలో పెట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య 56 సంవత్సరాల క్రితం కుదిరిన సింధూ జల ఒప్పందాన్ని సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తతో పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏం చేయాలో దిక్కుతోచక పరగుపరుగున ప్రపంచ బ్యాంకు గేటు ముందు పడిగాపులు కాస్తోంది. 
 
సింధు నది నీటి విషయంలో భారత్ కఠినంగా వ్యవహరిస్తే పాకిస్తాన్ బికారి కావడం ఖాయం. ఈ నేపధ్యంలో తమను ఎలాగైనా ఆదుకోవాలంటూ ప్రపంచ బ్యాంకు వద్ద మొరపెట్టుకుంటోంది పాకిస్తాన్. గతంలో ఈ అంశంపై ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది. ఇప్పుడు కూడా వారే కల్పించుకుని సమస్యను సర్దుబాటు చేయాల్సిందిగా పాకిస్తాన్ అధికారులు కోరుతున్నారు. పాక్ అటార్నీ జనరల్ అస్తర్ అసఫ్ అలీ నేతృత్వంలో పాక్ నీటి పారుదల శాఖ కార్యదర్శి ముహమ్మద్ యూనిస్ డాగాతో సహా పలువురు అధికారులు పాల్గొన్నట్లు జియో న్యూస్ వెల్లడించింది.