మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (18:07 IST)

ఒక్కటైన ఇమ్రాన్ ఖాన్.. మియాందాద్.. పొగడ్తలే పొగడ్తలు!

పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్పాఫ్ (పీటీఐ) అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు తన సహచర ఆటగాడు జావేద్ మియాందాద్ బాసటగా నిలిచారు. గతంలో పాక్ క్రికెట్ జట్టులో వీరిద్దరి మధ్య  తీవ్ర విభేదాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. 1986లో షార్జాలో జరిగిన ఓ టోర్ని ఫైనల్ మ్యాచ్‌లో జావెద్ మియాందాద్ సిక్స్ కొట్టి సంచలన విజయాన్ని పాకిస్థాన్‌కు అందించారు. 
 
ఈ నేపథ్యంలో ఎడమొహం పెడమొహంగా ఉన్న వీరిద్దరూ ఏకమయ్యారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌కు మియాందాద్ మద్దతు తెలిపారు. దేశ రాజకీయాలు సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఇమ్రాన్‌కు మియాందాద్ తోడుగా నిలవడం పట్ల మీడియా బాగానే ఫోకస్ చేశాయి. 
 
ఇమ్రాన్ జాతీయ సమైకత్య కోసం పాటుపడే గొప్ప నాయకుడు అని జావెద్ ప్రశంసల వర్షం కురిపించారు. దేశ భవిష్యత్ కోసం ఆయన చూసిన తపన, నిజాయితీని ఎవరూ శంకించలేరు అని జావెద్ కొనియాడారు. పాకిస్థాన్‌లో మార్పుకు, ప్రజలను చైతన్య పరిచే శక్తి ఇమ్రాన్‌లో ఉందని.. అందుకే ఆయనకు మద్దతు తెలుపుతున్నానని జావేద్ ప్రకటించారు.