గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2016 (10:49 IST)

కోహినూరు డైమండ్‌ను బ్రిటన్‌కు గిఫ్టుగా ఇచ్చాం.. చేతులెత్తేసిన పాకిస్థాన్!

కోహినూర్ వజ్రంపై పాకిస్థాన్ కూడా చేతులెత్తేసింది. ఇప్పటికే ఈ వజ్రంపై భారత్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో... కోహినూర్‌ డైమండ్‌ విషయంలో పాకిస్థాన్‌ కూడా చేతులెత్తేసింది. ఇప్పటివరకు దీనిని మాదంటే మాదని వాదించిన పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం.. బ్రిటన్‌ నుంచి దీనిని తిరిగి వెనక్కి తీసుకురాలేమని కుండబద్దలు కొట్టింది. 
 
1849 నాటి ట్రీటీ ఆఫ్‌ లాహోర్‌ (లాహోర్‌ ఒప్పందం) కింద కోహినూర్‌ వజ్రాన్ని బ్రిటన్‌కు అప్పగించినట్టు తెలిపింది. కోహినూర్‌ ఇక బ్రిటన్‌దేనని, దీనిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏవీ వెనక్కి తీసుకురాలేవని తేల్చిచెప్పింది. కోహినూర్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా పంజాబ్‌ ప్రభుత్వ న్యాయాధికారి లాహోర్‌ హైకోర్టుకు తెలిపారు.