బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2016 (15:06 IST)

పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి.. 25 మంది మృత్యువాత

పాకిస్థాన్‌‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఏజెన్సీ ప్రాంతమైన మొహ్మండ్ జిల్లాలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. బుట్మనలోని ఓ మసీదుని టార్గెట్‌‌గా చేసుకొని మారణహోమం సృష్టిం

పాకిస్థాన్‌‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఏజెన్సీ ప్రాంతమైన మొహ్మండ్ జిల్లాలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. బుట్మనలోని ఓ మసీదుని టార్గెట్‌‌గా చేసుకొని మారణహోమం సృష్టించారు. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో సూసైడ్ బాంబర్ దాడి చేశాడు. ఈ ఘటనలో 25 మంది మరణించగా, మరో 29 మంది గాయపడ్డారు. మసీదులో మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. 
 
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో అల్ ఖైయిదా, తాలిబన్, ఇతర ఇస్లామిక్ గ్రూపుల ప్రాబల్యం ఉంది. కాగా దాడికి పాల్పడింది ఎవరన్న విషయం తెలియరాలేదు. ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.