శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (14:11 IST)

పాక్‌ ప్రధాని అబ్బాసీ సంచలన వ్యాఖ్య... భారత్ పైకి అణ్వాయుధాలతో...

కుక్క తోక వంకర అనే మాట పాకిస్తాన్ విషయంలో చక్కగా సరిపోతుంది. ఒకవైపు తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించమని చెప్తూనే వాస్తవాధీన రేఖ ద్వారా ఉగ్రవాదులను దేశంలోకి చొప్పిస్తుంటుంది. దాడులు జరిగితే తమకు ఏమీ తెలియదని తప్పుకుంటుంది. ఇప్పుడు ఆ దేశ ప్రధాని షహీద్‌ ఖక

కుక్క తోక వంకర అనే మాట పాకిస్తాన్ విషయంలో చక్కగా సరిపోతుంది. ఒకవైపు తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించమని చెప్తూనే వాస్తవాధీన రేఖ ద్వారా ఉగ్రవాదులను దేశంలోకి చొప్పిస్తుంటుంది. దాడులు జరిగితే తమకు ఏమీ తెలియదని తప్పుకుంటుంది. ఇప్పుడు ఆ దేశ ప్రధాని షహీద్‌ ఖకాన్‌ అబ్బాసీ భారతదేశం పైన అవసరమైతే స్వల్ప లక్ష్య అణ్వాయుధాలను ప్రయోగిస్తామని ప్రకటించి తన బుద్ధి ఏమిటో బయటపెట్టారు. 
 
పైగా ఈ మాటను సమర్థించుకునేందుకు... భారతదేశం సర్జికల్ ఎటాక్స్ పేరుతో పాకిస్తాన్ దేశంపైన యుద్ధం చేస్తోందనీ, అందువల్ల ఆ దేశం ఆగడాలను అరికట్టేందుకు తాము అవసరమైతే స్వల్ప లక్ష్య అణ్వాయుధాలను ఉపయోగించేందుకు వెనుకాడబోమని అన్నారు. తమ దేశం ఉగ్రవాద కార్యకలాపాలకు ఆలవాలంగా మారిందన్న వార్తలను కొట్టి పారేశారు. 
 
ఆఫ్ఘనిస్తాన్ దేశంతో పాకిస్తాన్ దేశాన్ని పోల్చడం సరికాదన్నారు. మరోవైపు పాక్ ప్రధాని వ్యాఖ్యలపై భారతదేశం తీవ్రంగా ఖండించింది. పాక్ ధోరణిలో మార్పు రాకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.