Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హఫీజ్ సయ్యీద్‌కు షాక్: పాకిస్థాన్‌ ఏం చేసిందో తెలుసా?

మంగళవారం, 2 జనవరి 2018 (09:07 IST)

Widgets Magazine
Hafiz Saeed

ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయ్యీద్‌కు పాకిస్థాన్‌ చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా హఫీజ్‌ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. అతనికి షాకివ్వాలని పాకిస్థాన్ రంగం సిద్ధం చేస్తోంది. 
 
ఇప్పటికే హఫీజ్ రాజకీయ పార్టీ పెట్టాడు. లాహోర్‌లో పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించాడు. ఉగ్రవాది పాకిస్థాన్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఇంకా ప్రపంచ దేశాలు కూడా పాకిస్థాన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో హఫీజ్ ఆధ్వర్యంలో నడుస్తున్న చారిటీలు విరాళాలు సేకరించకుండా నిషేధం విధించింది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండర్ ఎక్స్ఛేంజి  కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ (ఎస్ఈసీపీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఉగ్రవాది ఆధ్వర్యంలో నడుస్తున్న జమాత్-ఉద్-దవా(జేయూడీ), లష్కరే తాయిబా (ఎల్‌ఈటీ), ఫలాహ్-ఇ-ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్)‌లకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల జాబితాలో ఉన్న జేయూడీ, లష్కరే తాయిబాతోపాటు మరో రెండు సంస్థలపై నిషేధం విధించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కేసీఆర్ సాబ్.. అంత పెద్ద టాస్క్ ఎలా సాధ్యమైంది? : జనసేనాని ప్రశ్న

రాష్ట్రంలోని రైతాంగాన్ని అదుకునేందుకు వీలుగా జనవరి ఒకటో తేదీ నుంచి 24 గంటల పాటు ఉచిత ...

news

బ్రెడ్ అంటేనే మనకు మనసు డెడ్.. చింతకాయ పచ్చడిని: వెంకయ్య

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాక్చాతుర్యం కలిగిన వారు. వేదికపై ఆయన ప్రసంగం చేస్తే.. అందరూ ...

news

చలికాచుకుందామని కూర్చుంటే కారు దూసుకెళ్లింది.. ఐదుగురు మృతి

అసలే చలికాలం. చలిమంట కాచుకుందామని ఓ నలుగురు మంటల ముందు కూర్చున్నారు. అంతే వారిపై అదుపు ...

news

రెచ్చగొడితే మాత్రం రాజకీయాల్లో వస్తా: ప్రకాష్ రాజ్ ప్రకటన

సినీ తారలు రాజకీయాల్లోకి రావడం ఫ్యాషనైపోయింది. నిన్న సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో ...

Widgets Magazine