శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 4 ఫిబ్రవరి 2017 (07:38 IST)

మన జవాన్ల ఆకలి కేకలపై పాక్ ఐఎస్ఐ జోకులు.. తిండి పెడతాం రమ్మని ఆహ్వానాలు

ఎంకి పెళ్లి సుబ్బడి చావుకొచ్చింది అంటే ఇదేనేమో. ఒకవైపు సైన్యంలో జవాన్లకు నాసిరకం తిండిపెడుతున్నారని, వివక్ష చూపిస్తున్నారని పారామిలటరీ బలగాలు కోడై కూస్తుంటే పరువు పోతోందని భారతీయ సైన్యాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైవు మాత్రం మన జవాన్లు పెడు

ఎంకి పెళ్లి సుబ్బడి చావుకొచ్చింది అంటే ఇదేనేమో. ఒకవైపు సైన్యంలో జవాన్లకు నాసిరకం తిండిపెడుతున్నారని, వివక్ష చూపిస్తున్నారని పారామిలటరీ బలగాలు కోడై కూస్తుంటే పరువు పోతోందని భారతీయ సైన్యాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైవు మాత్రం మన జవాన్లు పెడుతున్న ఆకలి కేకలకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ సంబరాలు చేసుకోవడమే కాదు అన్నం కావాలంటే రండి కావలసినంత ఆహారం మావద్ద ఉంది అంటూ పరాచికాలాడుతున్నారని సరిహద్దు భద్రతా దళం ఉన్నతాధికారి వాపోయారు.
 
తమ కోసం కేటాయిస్తున్న ఆహార పదార్థాలను ఉన్నతాధికారులు మార్కెట్లో అమ్ముకుంటూ తమను పస్తులుంచుతున్నారంటూ బీఎస్ఎప్ 29వ బెటాలియన్ జవాన్ తేజ్ బహదూర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులను చూసి పాక్ స్పై సంస్థ ఐఎస్ఐ సంబరాల చేసుకుంటోందట. పైగా పుండుమీద కారం జల్లినట్లుగా సరిహద్దుల్లో కాపలా కాస్తున్న పాక్ సైనికులు మన సైనికులను చూసి ఎత్తిపొడువు మాటలంటూ ఏడిపిస్తున్నారని బీఎస్ఎప్ అదికారి చెప్పారు.
 
ప్రత్యేకించి గుజరాత్ సరిహద్దు ప్రాంతంలోని బర్మార్ సెక్టర్లో కొన్ని ప్రాంతాల్లో పాక్ రేంజర్లు మన సైనికులను అవహేళన చేస్తున్నారట. ఆకలిగా ఉందా, దయచేసి రండి, మావద్ద కావలసినంత ఆహారం ఉంది అంటూ జోకులేస్తున్నారు. 
 
ఆహార పదార్దాలను అదికారులు అమ్ముకుంటూ సైనికులను పస్తులుంచుతున్నారని, సైన్యంలో అవినీతి పేరుకుపోయిందని తే్జ్ బహుదూర్, చౌదరి వంటి సైనికులు చేసిన ఆరోపణలపై భారత సైన్యం ఇప్పటికే విచారిస్తోందని కానీ సరిహద్దుల్లో ప్రథమ శ్రేణిలో పోరాడుతున్న సైనికులు పరువు పోయిందని బీఎస్ఎప్ అధికారి వాపోయారు. భారతీయ సైనికులు సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలను సాకుగా చేసుకుని పాకిస్తాన్ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థలు హేళన చేస్తున్నాయని ఇది బీఎస్ఎఫ్ బలగాల నైతిక స్థ్యైర్యాన్ని దిగజార్చివేస్తోందని ఆ అధికారి వాపోయారు
 
అత్త తిట్టిందని కాదు. తోటి కోడలు పకా పకా నవ్విందిని ఇంకా బాధపడిందట ఆ కోడలు. మన సైనికాధికారులు ఇప్పటికైనా పరువు నష్టం, నైతిక స్థైర్యం వంటి డైలాగులను పక్కనబెట్టి సైనికుల సంక్షేమాన్ని నిజాయితీగా పట్టించుకుంటే అదే పదివేలు. సమస్య మనవద్ద పెట్టుకోని ఇంకొకరు ఏదో అన్నారని వాపోతే ఎలా.