Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మరో ఉత్తర కొరియాగా పాకిస్థాన్.. భారీగా అణ్వాయుధాల తయారీ?

సోమవారం, 25 సెప్టెంబరు 2017 (09:47 IST)

Widgets Magazine
pakistan terrorism

పాకిస్థాన్‌ మరో ఉత్తర కొరియా కానుందా? అణ్వాయుధ సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందా? ఆసియాలో మరోసారి అణుపోటీకి తెరతీస్తోందా? ఉత్తర కొరియా, చైనాలను పాకిస్థాన్‌కు సహకారం అందిస్తున్నాయా? అంటే అవుననే అంటున్నారు అమెరికా రక్షణ రంగ నిపుణులు. 
 
ఆసియాలో మరోసారి అణ్వాయుధ పోటీకి పాకిస్తాన్‌ తెరతీస్తోందని వారు ప్రకటించారు. ఒకేసారి తొమ్మిది కేంద్రాల్లో పాకిస్థాన్‌ అణ్వాయుధాల తయారీ చేస్తోందని అమెరికన్‌ సైంటిస్టులు వెల్లడించారు. ఇప్పటికే ఉగ్రవాదులకు స్థావరంగా మారిన పాకిస్థాన్.. మరిన్ని న్యూక్లియర్‌ వెపన్స్‌ రూపొందిస్తే పరిస్థితులు భయానకంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్టులు అంచనా ప్రకారం.. పాకిస్థాన్‌ 130-140 న్యూక్లియర్‌ వార్‌హెడ్లను రూపొందించే పనిలో పడింది. వీటిని వీలైనంత త్వరగా తయారు చేసి.. సైన్యానికి అప్పగించాలని ప్రయత్నాలు చేస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
 
పాకిస్థాన్‌ అణ్వాయుధాలను మొత్తం తొమ్మది కేంద్రాల్లో తయారు చేస్తోందని ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో పంజాబ్‌ ప్రావిన్స్‌లో 4, సింధ్‌ ప్రావిన్స్‌లో 3, బలూచిస్తాన్‌లో 2 కేంద్రాల్లో ఆయుధాలు రూపొందుతున్నాయని ఎఫ్‌ఏఎస్‌ ప్రకటించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమ్మ మృతిపై నా వ్యాఖ్యలకు కట్టుబడి వున్నా: దిండుగల్ శ్రీనివాసన్

దివంగత సీఎం జయలలిత మృతి పట్ల వున్న అనుమానాలను అధికం చేస్తూ అటవీశాఖ మంత్రి దిండుగల్ ...

news

అమ్మ మృతిపై సీబీఐ విచారణ జరపాలి : స్టాలిన్ డిమాండ్

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంపై సీబీఐ విచారణ జరపాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, విపక్ష ...

news

తమ రాసక్రీడను చూశాడనీ వాచ్‌మెన్‌ను చంపేశారు...

ఓ మహిళతో ఒక ఆటో డ్రైవర్ ఏకాంతంగా ఉన్న దృశ్యాన్ని చూశాడనీ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌ను ...

news

నకిలీ పత్రాలతో బాలికను పెళ్లాడిన అరబ్ షేక్.. ఐదు లక్షలు తిరిగిస్తేనే పంపుతానని?

పాతబస్తీ బాలికను వివాహం చేసుకుని అహ్మద్ అబ్ధుల్లా అముర్ అలీ నకిలీ పత్రాలతో ఒమన్ ...

Widgets Magazine