గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (17:41 IST)

టెర్రరిస్టులపై పాక్ ఉక్కుపాదం : ఒక్క ఇస్లామాబాద్‌లోనే 300 మంది అరెస్టు!!

తనదాకా వస్తేకానీ తెలియదన్న సామెతను నిజం చేస్తూ పెషావర్ దాడి తర్వాత పాకిస్థాన్ భద్రతాల బలగాలు తీవ్రవాదులపై విరుచుకుపడుతున్నాయి. పెషావర్ సైనిక పాఠశాలలో తాలిబన్ తీవ్రవాదులు మారణహోమం సృష్టించిన తర్వాత పాక్ సైనిక బలగాలతో పాటు ఆ దేశ ప్రభుత్వం కూడా మొద్దు నిద్రను వీడింది. 
 
పెషావర్ దాడి జరిగి 48 గంటలు తిరగకముందే జైళ్ళలో ఉన్న ఉగ్రవాదులందరినీ ఉరి తీయాలని ఆ దేశ సైనిక చీఫ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఫైసలాబాద్‌లో నలుగురు తీవ్రవాదులకు ఉరిశిక్షను అమలు చేసింది. అలాగే, తీవ్రవాదులపై పగబట్టేశాయా అనే రీతిలో దేశవ్యాపంగా గాలింపు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఒక్క రోజులోనే ఇస్లామాబాద్ చేపట్టిన గాలింపు చర్యల్లో తీవ్రవాద అనుమానిత వ్యక్తులుగా భావిస్తున్న 300 మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. 
 
దీంతో పాకిస్థాన్ భద్రతా బలగాలపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు కురుస్తున్నాయి. పాకిస్థాన్‌లో తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించాలని, ఏ చిన్న వేరును మిగిల్చినా, అది ఆ దేశ భద్రతా బలగాలకు పెను సవాలు విసురుతుందని హెచ్చరిస్తున్నాయి.