మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 14 జనవరి 2017 (12:04 IST)

మద్యం సేవంచే రాజకీయ నేతలను ఉరితీయాలి : సెనేటర్ షాహీ సయ్యద్

పాకిస్థాన్ దేశంలోని అవామీ నేషనల్ పార్టీకి చెందిన షాహీ సయ్యద్ అనే సెనేటర్ ఓ సంచలన ప్రకటన చేశారు. మద్యం తాగే రాజకీయ నాయకులకు మరణశిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. అవామీ నేషనల్ పార్టీ అధికారిక సమావేశంల

పాకిస్థాన్ దేశంలోని అవామీ నేషనల్ పార్టీకి చెందిన షాహీ సయ్యద్ అనే సెనేటర్ ఓ సంచలన ప్రకటన చేశారు. మద్యం తాగే రాజకీయ నాయకులకు మరణశిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. అవామీ నేషనల్ పార్టీ అధికారిక సమావేశంలో చేసిన సూచన సంచలనం రేపింది. 
 
దేశంలో మద్యం తాగిన సాధారణ పాక్ పౌరులకు ఆరునెలలు, ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తుండగా, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటేరియన్లకు ఉరిశిక్ష లేదా మరణదండన ఎందుకు విధించకూడదని షాహీ సయ్యద్ సెనేట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రశ్నించారు. 
 
గంజాయి తాగే వారిపై మాట్లాడుతూ గంజాయి, దార్వేష్ అనే మత్తు పానీయం, నల్లమందులపై కూడా దేశంలో నిషేధం విధించాలని ఆయన కోరారు. రాజకీయ నాయకులు ఎవరైనా మద్యం, గంజాయి, నల్లమందు తీసుకుంటున్నట్లయితే అలాంటి వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రకటించాలని సెనేట్ సమావేశానికి అధ్యక్షత వహించిన మరో సెనేటర్ రహమాన్ మాలిక్ చెప్పారు. 
 
దేశంలో హిందూ పేరుతో ముస్లిమ్ వ్యక్తి మద్యం విక్రయించడం విచారకరమని సయ్యద్ పేర్కొన్నారు. పాకిస్థాన్ దేశంలో మద్యం తాగడం, విక్రయించడంపై నిషేధం విధించినా, ఇతర మతాల వారి కోసం లైసెన్సుడ్ మద్యం దుకాణాల ద్వారా విక్రయిస్తున్నారు. మొత్తంమీద పాక్ సెనేటర్లు మద్యం తాగే రాజకీయ నాయకులకు మరణదండన విధించాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది.