శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 17 ఏప్రియల్ 2016 (13:46 IST)

అబ్బాయిలు.. అమ్మాయిలు కలిసి కూర్చొంటే రూ.5 వేల జరిమానా.. వర్శిటీ ఆదేశం

మతమౌఢ్యానికి ప్రతీకగా నిలిచిన పాకిస్థాన్‌లోని ఓ విశ్వవిద్యాలయం విద్యార్థులపై కొన్ని రకాల కఠిన ఆంక్షలను విధించింది. అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి నడిచినా.. ఒకే బల్లపై కూర్చొన్నా భారీగా అపరాధం విధిస్తామని ప్రకటించింది. 
 
ఈ మేరకు పాకిస్థాన్‌లోని స్వాత్‌ విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది. యువతీయువకులు ఒకరితో ఒకరు కలిసి తిరగకూడదని కలిసి కూర్చోకూడదని క్యాంపస్‌లో నోటీసులు జారీ చేసింది. 
 
ఒక వేళ ఎవరైనా ఈ నిబంధనల్ని అతిక్రమిస్తే.. రూ.50 నుంచి రూ.5,000 వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడేందుకు అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఈ విషయాన్ని పాక్‌ మీడియా ప్రధానంగా పేర్కొంది.