గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2016 (11:18 IST)

నవాజ్ షరీఫ్‌కు షాకుల మీద షాకులు.. సుప్రీం కోర్టు నోటీసులు.. పనామా పేపర్స్ లీక్‌తో..

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. భారత సైన్యం ఇచ్చిన సర్జికల్ స్ట్రైక్స్ షాకుతో దిమ్మదిరిగిపోయిన నవాజ్ షరీఫ్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. నవాజ్ షరీఫ్ కుటుంబం అ

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. భారత సైన్యం ఇచ్చిన సర్జికల్ స్ట్రైక్స్ షాకుతో దిమ్మదిరిగిపోయిన నవాజ్ షరీఫ్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. నవాజ్ షరీఫ్ కుటుంబం అవినీతికి పాల్పడుతుందని, విదేశాల్లో ఆస్తులు పోగేసుకుంటుందని ఆయన ప్రధానిగా అనర్హుడిగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌కు సుప్రీం కోర్టు స్పందించింది. తాజాగా నవాజ్ షరీఫ్‌కు నోటీసులు జారీ చేసింది.
 
పనామా పేపర్ లీక్స్‌ను ఆధారంగా చేసుకుని ఈ పిటిషన్ దాఖలైంది. నవాజ్ షరీఫ్ మీద ఆరోపణలు చేసిన వారిలో నాటి ప్రముఖ క్రికెటర్ పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కూడా ఉన్నారు. అవినీతి ఆరోపణలు.. అక్రమంగా సంపాదించిన సొమ్మును విదేశాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలు ప్రధాని నవాజ్‌‌తో పాటు ఆయన కుమార్తె, కుమారులు, అల్లుడు ఆర్థిక మంత్రితో పాటు పలువురు ముఖ్యఅధికారుల మీద కూడా రావటంతో వారందరికి టోకుగా నోటీసులు జారీ అయ్యాయి. పాక్ అత్యున్నత న్యాయస్థానం దేశ ప్రధానికే నోటీసులు ఇవ్వటం ఇప్పుడా దేశంలో ఆసక్తికర చర్చగా మారింది.
 
ఇప్పటికే పాక్‌పై ఉగ్రవాద ముద్ర వేయాలన్న పట్టుదలతో మోడీ చేస్తున్న ప్రయత్నాలు ఓవైపు బలూచిస్థాన్ ఇష్యూతో తగులుతున్న ఎదురుదెబ్బలతో సతమతం అవుతున్న నవాజ్ షరీఫ్‌కు పాకిస్థాన్ మీడియా నుంచి అనుకోని షాక్ తగిలిన సంగతి తెలిసిందే.