శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (09:05 IST)

విశ్వ సుందరిగా కొలంబియా యువతి పౌలినా వెగా

విశ్వసుందరి కిరీటాన్ని కొలంబియా సుందరి చేజిక్కించుకుంది. కొలంబియాకు చెందిన 22 ఏండ్ల పౌలినా వెగా  విశ్వసుందరి కిరిటాన్ని ఎగరేసుకుపోయింది. మియామీలో జరిగిన విశ్వసుందరి పోటీల్లో ‘మిస్‌’ కొలింబియా పౌలినా వెగా విజేతగా నిలిచింది. రన్నరప్‌ టైటిల్‌ను అమెరికాకు చెందిన నియా గెలుచుకుంది.
 
ఈ పోటీల్లో మొత్తం 80 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్నారు. పౌలినా వెగా కొలంబియాలో ఎంబీఏ చదువుతోంది. 2013 మిస్ యూనివర్స్ గాబ్రియేలా ఐలర్.. వెగాకు విశ్వసుందరి కిరీటాన్ని అలంకరించారు. కాగా భారత్ తరఫున ఈ పోటీల్లో పాల్గొన్న నొయోనిత లాధ్ (21) టాప్-10లో స్థానం దక్కించుకోలేకపోయారు.