మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2017 (10:03 IST)

People for sale: మనుషులను అంగడి సరుకుల్లా అమ్మేస్తున్నారు...

ప్రపంచం 21వ శతాబ్దంలో జీవిస్తున్నామంటూ వేదికలపై గొప్పగా చెప్పుకుంటుంటాం. అయినా ఇంకా రాతియుగపు ఆనవాళ్లను అలాగే మోసుకెళుతున్నాం. సంతలో పశువులను కొనుక్కున్నట్టుగా మనుషులను కూడా కొనుక్కు వెళుతున్నారు జనం.

ప్రపంచం 21వ శతాబ్దంలో జీవిస్తున్నామంటూ వేదికలపై గొప్పగా చెప్పుకుంటుంటాం. అయినా ఇంకా రాతియుగపు ఆనవాళ్లను అలాగే మోసుకెళుతున్నాం. సంతలో పశువులను కొనుక్కున్నట్టుగా మనుషులను కూడా కొనుక్కు వెళుతున్నారు జనం. లిబియా రాజధాని ట్రిపోలీలో జరుగుతున్న ఈ బానిస వ్యాపారం… ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. 
 
సంక్షోభాలతో అతలాకుతలమైన ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపాకు వలసపోతున్న శరణార్థుల్ని లిబియా స్మగ్లర్లు అంగడి సరుకుల్లా అమ్మేస్తున్నారు. ఒక్కోవ్యక్తిని రూ.20 నుంచి రూ.30 వేల వరకు వెలకట్టి అమ్మేస్తున్నారు. రోజువారీ కూలీల కింద విక్రయిస్తున్నారు. కొన్న వ్యక్తులు వీరిని వ్యయసాయ పనులు లేదా నిర్మాణ రంగం తదితర పనుల కోసం తీసుకువెళుతున్నారు. 
 
ఆరోగ్యంగా ఉండి, కండబలం ఎక్కువగా ఉన్న యువకులు ఎక్కువ రేటు పలుకుతున్నారు. స్మగ్లర్ల పడవలపై ఐరోపా దేశాలు విరుచుకుపడుతుండటంతో.. శరణార్థుల్ని ఎక్కడికి తీసుకువెళ్లాలో దిక్కుతెలియని స్మగ్లర్లు వారిని వేలంలో విక్రయించేస్తున్నారు.