శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (09:18 IST)

పిల్లలందరినీ చంపేశాం ఏం చేయమంటారు : హైకమాండ్‌తో ముష్కరుల ప్రశ్న!

పెషావర్ సైనిక పాఠశాలలో మారణహోమం సృష్టించిన తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ తీవ్రవాదులకు, ఆ సంస్థకు చెందిన హైకమాండ్ పెద్దలకు జరిగిన సంభాషణలను డాన్ పత్రిక ప్రచురించింది. ఈ మారణహోమం సృష్టించేందుకు పాఠశాలలో చొరబడిన ముష్కరులు.. తమ ఆపరేషన్‌ను పూర్తి చేసేందుకు హ్యాండర్లతో మాట్లాడుతూ తమ దృశ్యర్యలను కొనసాగించారు. 
 
ఒకానొక సందర్భంలో 'ఆడిటోరియంలో ఉన్న పిల్లలందరినీ చంపేశాం. ఏం చేయమంటారు?' అని ఓ ఉగ్రవాది వారి హైకమాండ్‌ను అడగగా, 'పాక్ సైనికులు వచ్చేంత వరకు అక్కడే ఉండండి. అక్కడకు వచ్చాక వాళ్లని చంపేసి, తర్వాత మిమ్మల్ని మీరు పేల్చుకుని చచ్చిపొండి' అంటూ అటు నుంచి సమాధానం ఇచ్చారని డాన్ పత్రిక తెలిపింది. ఈ విషయం భద్రతాదళానికి చెందిన ఓ అధికారి చెప్పినట్లు పాక్ పత్రిక డాన్ స్పష్టం చేసింది. 
 
భద్రతాదళాలు ఉగ్రవాదుల మీద విరుచుకుపడేందుకు కొద్ది నిమిషాల ముందు గోడచాటు నుంచి విన్న మాటలని వారు స్పష్టం చేశారు. దాడులకు పాల్పడినవాళ్లలో ఒకరి పేరు అబుజర్ అని, అతడి కమాండర్ పేరు ఉమర్ అని సైనికులు చెప్పారు. ఉమర్ ఖలీఫా అనే సీనియర్ ఉగ్రవాది, ఫ్రాంటియర్ రీజియన్ పెషావర్ ప్రాంతానికి చెందినవాడని సైనికులు వివరించారు.