శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 2 మే 2016 (15:59 IST)

16 ఏళ్ళ ప్రాయం.. బాయ్ ఫ్రెండ్ మోజు.. తల్లిదండ్రుల్ని, తమ్ముడిని హత్య చేయించిన గర్ల్ ఎక్కడ?

పదహారేళ్ల ప్రాయాన్ని స్వీట్ సిక్స్‌టీన్ అంటారు. ఆ యుక్త వయస్సులో అమ్మాయిల వెంట అబ్బాయిలు పడటం మామూలే. అలా ప్రేమలో పడిన అమ్మాయిలు తమ ప్రేమను సాధించుకోవడం కోసం తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. లేదా మరికొందరు ఇంటినొదిలి బాయ్ ఫ్రెండ్ వెంట వెళ్ళిపోతారు. ఇలాంటి కథలే మనం సాధారణంగా వినివుంటాం. అయితే ఓ పదహారేళ్ల వయస్సులో బాయ్ ఫ్రెండ్ మోజులో పడి ఓ అమ్మాయి ఆమె కుటుంబాన్ని హత్య చేసింది. బాయ్ ఫ్రెండ్ కోసం తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని ఈ లోకంలో లేకుండా చేసింది. ఫలితం ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తోంది.
 
వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం 24 ఏళ్ల ఎరిన్ కాఫీ అనే యువతి గత 8 సంవత్సరాలుగా జైలులో శిక్ష అనుభవిస్తోంది. తన కుటుంబాన్ని పొట్టనబెట్టుకున్న నేరానికి ఈ శిక్ష అనుభవిస్తోంది. అలాంటి నీచపు కిల్లర్‌ను మాజీ జడ్జి మోర్గాన్ జైలులో కలిసి ఇంటర్వ్యూ చేశారు. ఆ క్షణంలో ఆమెతో మాట్లాడిన విషయాలను చెప్పారు. 
 
ఇంతకీ ఆ మోనార్కురాలు గురించి జడ్జి ఏం చెప్పారంటే..? టీవీ ప్రోగ్రామ్‌ల కోసం క్రూరమైన నేరాలు చేసేవారిని ఇంటర్వ్యూ చేయడం తన అలవాటు అన్నారు. ఈ క్రమంలోనే ఎరిన్‌ను ఇంటర్వ్యూ చేశానని తెలిపారు. అయితే ఆమె చెప్పిన మాటలు విని తన జీవితంలో అలాంటి దెయ్యం మహిళను చూడలేదని చెప్పేశారు. తన కుటుంబాన్ని బాయ్‌ఫ్రెండ్ కోసం మట్టుబెట్టానని చెప్పినట్లు వెల్లడించారు. 
 
2008 నాటికి ఆమెకు 16 ఏళ్ళు. ఆమెకు అన్నీ దురలవాట్లు ఉండేవట. రాత్రివేళలో బాయ్ ఫ్రెండ్ పిచ్చితో అతని వద్దే ఉండేదట. తల్లిదండ్రులు వార్నింగ్ ఇస్తే.. వారికి భయపడుతున్నట్లు నటించింది. వారిని హతమార్చాలని ప్లాన్ చేసింది. అంతే బాయ్‌ఫ్రెండ్.. వాడి ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ సాయంతో పనికానిచ్చేసింది. ఈ క్రమంలో కన్నతల్లిపై, కన్నతండ్రిపై, తమ్ముడిపై కాల్పులు జరిపించి, కత్తులతో పొడిపించి హత్యచేయించింది... ఈ మాటలు విని తాను షాక్ అయ్యానని.. జీవితంలో ఇలాంటి దెయ్యం మహిళను ఎక్కడా చూడలేదని జడ్జి చెప్పుకొచ్చారు.