Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పావురాళ్ళకు గర్భనిరోధక మాత్రలు.... గోల చేస్తున్న జంతు ప్రేమికులు

మంగళవారం, 29 నవంబరు 2016 (14:41 IST)

Widgets Magazine
pigeons

సాధారణంగా వీధి కుక్కల బెడద ఎక్కువైతే వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి.. కుక్కల ఉత్పత్తిని తగ్గిస్తారు. మరి పావురాళ్ళ బెడద ఎక్కువైతే ఏం చేయాలి? దీనిపై సుదీర్ఘంగా ఆలోచన చేసిన స్పెయిన్ వైద్యులకు ఓ వినూత్న ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా అమల్లో పెట్టేశారు. అదే.. పావురాళ్ళకు కూడా గర్భనిరోధక మాత్రలను ఇవ్వాలని నిర్ణయించారు. 
 
స్పెయిన్ దేశంలో పావురాళ్లు సంఖ్య అధికంగా ఉంది. ఇవి భవనాలపై చేరి.. రెట్టలు వేస్తుంటాయి. దీనివల్ల భవనం అందాలు దెబ్బతినిపోతున్నాయి. అలాగే, స్పెయిన్‌ దేశానికి వచ్చే పర్యాటకులకు కూడా ఇబ్బందులు కలిగిస్తున్నాయట. దీంతో వీటిని నియంత్రించేందుకు గర్భనిరోధక మాత్రలు వాడాలని నిర్ణయించారు.
 
అయితే, స్పెయిన్ దేశంలోని జంతు ప్రేమికులు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పావురాలకు జులై నుంచి డిసెంబర్‌ మధ్య సంతానోత్పత్తి ఉంటుంది. దానికంటే ముందు గర్భనిరోధక మాత్రల్ని అవి తినే ఆహారంలో కలిపి పెడుతున్నారు. గతేడాది.. నగరంలో రెండు చోట్ల గర్భనిరోధక మాత్రలతో కూడిన ఆహారాన్ని వాటికి పెట్టారు. 
 
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 40 ప్రాంతాల్లో ఈ ఆహారం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ పద్ధతి సత్ఫలితాలిస్తే.. వచ్చే నాలుగైదు ఏళ్లల్లో 80 శాతం మేర పావురాల సంఖ్య తగ్గుతుందని.. పావురాలను చంపే పద్ధతిని పూర్తిగా నిషేధిస్తామని అధికారులు చెబుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వామ్మో.. ఆ జైలులో టెర్రరిస్టులు, గ్యాంగ్‌స్టర్ల రాజభోగాలు అనుభవిస్తున్నారట.. బర్త్ డే కేకులు, కుక్‌లు, జిమ్‌లు?

పంజాబ్‌లోని పాటియాలా ప్రాంతంలోని నాభా కారాగారంలో శిక్ష అనుభవించే ఉగ్రవాదులు, ...

news

తమ్ముడిని బయటకు పంపి గర్ల్‌ఫ్రెండుతో అన్న శ్రుంగారం... చలి పులి తట్టుకోలేక అన్నను హత్య..

ఢిల్లీలో దారుణం జరిగింది. గర్ల్‌ఫ్రెండ్ వివాదంలో తమ్ముడు అన్నను చంపేశాడు. అర్థరాత్రిపూట ...

news

కేసీఆర్ కామెంట్స్ ఎఫెక్ట్... భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలు బ్యాంకు వివరాలు చెప్పండి... మోదీ

సోమవారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ...

news

నల్లకుబేరులతో కుమ్మక్కైన బ్యాంకు అధికారులు.. రూ.కోట్లు వైట్‌మనీగా మార్చేశారు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయానికి బ్యాంకు మేనేజర్లు, సిబ్బంది ఆదిలోనే తూట్లు ...

Widgets Magazine