శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 24 జులై 2014 (09:29 IST)

తైవాన్ విమాన ప్రమాదం ఎలా జరిగింది.. మృతులెందరు?

తైవాన్‌ అత్యవసర ల్యాండింగ్ చేయబోని ఓ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య గురువారానికి 51కు చేరింది. ఈ విమాన ప్రమాదం బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 58 మంది ప్రయాణికులు ఉండగా, వీరిలో 51 మంది మృత్యువాతపడ్డారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
తైవాన్‌లోని పెంఘు రాష్ట్రంలో ట్రాన్స్ ఆసియా ఎయిర్ వేస్ విమానం కుప్పకూలింది. 54 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో వెళ్తున్న తైవానీస్ ఎయిర్లైన్ సంస్థ ట్రాన్సేషియా ఎయిర్వేస్కు చెందిన ఈ విమానాన్ని మాగాంగ్ నగరంలో అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అది విఫలం కావడంతో విమానం కూలిందని తెలుస్తోంది. 
 
ఈ విమానం టైపూల్ తుఫాను ధాటికి తైవాన్‌లో కుప్పకూలింది. టైపూన్ తుఫాను కారణంగా ప్రచండమైన గాలులు వీయడం వల్లనే కూలిపోయి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మట్మో టైపూన్ ప్రభావంతో భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల అత్యవసరంగా ల్యాండ్ చేయాలని పైలట్ నిర్ణయించారు. 
 
విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్న సమయంలోనే నేలకూలింది. దీంతో టైఫూన్ భీకర గాలుల కారణంగానే విమానం కూలిపోయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. తైవాన్‌లోని పెంఘ ద్వీపంలో ట్రాన్స్ ఆసియా విమానం కూలిపోయిన ప్రాంతంలో సహాయక చర్యలను 200 మందితో కూడిన తైవాన్ బృందం చేపట్టింది.