గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 29 జూన్ 2015 (16:00 IST)

భవనంలోకి దూసుకుపోయి పేలిన విమానం: ముగ్గురు మృతి

విమానాలకు పట్టిన గ్రహణం వీడినట్టు లేదు. చిన్నవి, పెద్దవి అనే తేడా లేకుండా, సముద్రంలో, రోడ్లపై, పొలాల్లో అంటూ ఎక్కడ పడితే అక్కడ కుప్పకూలిపోతున్నాయి. తాజాగా ఓ విమానం ఏకంగా ఒక ఇంటిలోకి చొరబడి పేలిపోయింది. వివరాల్లోకి వెళితే.. మసాచూసెట్స్ రాష్ట్రంలోని ప్లెయిన్ విల్లే పట్టణంలో ఓ ఇంటిలోకి చిన్న రకం విమాన ఒకటి దూసుకొచ్చి, పేలిపోయింది.
 
ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఆ ఇంటిలో ఉన్న నలుగురు అదృష్టవశాత్తు ప్రాణాలతో తప్పించుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.