శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2016 (12:11 IST)

ఆకాశంలోనే ఢీకొన్న రెండు విమానాలు: సముద్రంలో పడిపోయాయ్!

రోడ్డుపై వాహనాలు అదుపుతప్పి ఢీకొనడం, ప్రమాదాలు జరగడం సహజం. కానీ ఆకాశంలో విమానాలు ఢీకొనడమంటే వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. తాజాగా అమెరికాలో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. అమెరికా తీరంలో ఆకాశంలో రెండు చిన్నపాటి విమానాలు ఢీకొని సముద్రంలోకి పడిపోయాయి. ఈ ప్రమాదం శుక్రవారం సాయంత్రం జరిగింది. లాస్ ఏంజిల్స్ నౌకాశ్రయానికి రెండు మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్టు అమెరికా కోస్ట్ గార్డ్ అధికారులు చెప్పారు.
 
ఈ రెండు విమానాల్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, మృతుల వివరాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో లైఫ్గార్డు బోట్ల సాయంతో డైవర్లు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన విమానం రెక్క భాగాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. కూలిన విమానాలు తొంభై ఫీట్ల నీళ్ల లోతులో ఉన్నట్లు లాస్ ఏంజిల్స్ కౌంటీ కెప్టెన్ ఎన్ తెలిపారు. నౌకాశ్రయం ప్రవేశద్వారాన్ని మూసివేసి సహాయక చర్యలు చేపట్టారు. యూఎస్ కోస్ట్‌గార్డ్స్ సహాయక చర్యల్లో భాగంగా గాలింపు చర్యలను చేపట్టారు.