వచ్చేనెల 21తో భూమి అంతమా?

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (06:40 IST)

planet x

వచ్చే నెల 21వ తేదీతో భూమి అంత కాబోతుందట. ఈ మాట చెపుతున్నది ఎవరో కాదు... పరిశోధనల్లో స్పెషలిస్ట్ అయిన డేవిడ్ మీడ్. అక్టోబర్ 21 నుంచి భూమికి ఇక నూకలు చెల్లినట్లేనని ఘంటాపథంగా చెపుతున్నాడు. 
 
నిజానికి ఈనెల 23వ తేదీనే ప్లానెట్ ఎక్స్ భూమిని ఢీకొట్టబోతుందనీ, చావడానికి అందరూ సిద్ధంగా ఉండండి అంటూ వార్నింగ్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇపుడే ఆ తేదీ వెళ్లిపోగా, ఈసారి కొత్త డేట్‌తో మన ముందుకు వచ్చాడు. అక్టోబర్ 21 నుంచి భూమికి ఇక నూకలు చెల్లినట్లే అంటూ వాదిస్తున్నాడు. ఈసారి మాత్రం తన అంచనా తప్పదని అంటున్నాడు. 
 
ఆ డేట్ ఈ శతాబ్దంలో ఎంతో ముఖ్యమైనది అని తన వెబ్‌సైట్‌లో రాసుకున్నాడు. ఆ రోజు నుంచే భూమిపై విపత్తులు మొదలవుతాయని, ఏడేళ్ల పాటు ఇవి కొనసాగుతాయని మీడ్ జోస్యం చెపుతున్నాడు. 
 
నిబిరు అనే గ్రహం మనవైపు దూసుకొందని, అది ఈ ఏడాది మన భూమిని దాటగానే.. భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు, అలలు ఎగిసిపడటం, ఇతర విపత్తులు సంభవిస్తాయని చెబుతున్నాడు. నాసా మాత్రం అతని అంచనాలను ఖండిస్తూనే వస్తున్నది. అసలు నిబిరు అనే గ్రహమే లేదని స్పష్టంచేసింది. దీనిపై మరింత చదవండి :  
Planet Nibiru: David Meade Predicts Doomsday Will Arrive On October 21

Loading comments ...

తెలుగు వార్తలు

news

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీ చేయడం, పోలవరం ప్రాజెక్ట్ పెరిగిన వ్యయం అంచనాలకు ...

news

అక్టోబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లో లక్ష గృహ ప్రవేశాలు.. మంత్రి కాలవ శ్రీనివాసులు

అమరావతి : రాష్ట్రంలో అక్టోబర్ 2న ప్రపంచ ఆవాస దినం, గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వ సహాయంతో ...

news

ఒక యజ్ఞంలాగా రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మిస్తున్నాం... చంద్రబాబు

‘‘ఒక పవిత్ర యజ్ఞంగా రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మిస్తున్నాం. ఎక్కడా పనులు ఆగకూడదు, ...

news

విద్యార్థినిపై అత్యాచార యత్నం... సన్నివేశాలు సోషల్ మీడియాలో పోస్ట్(వీడియో)

కామాంధుల దుశ్చర్యలు రోజురోజుకీ పెచ్చుమీరిపోతున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ ...