గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (09:15 IST)

ఇండోనేసియాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదు..!

ఇండోనేసియాలోని దక్షిణ దిశలో ఉన్న సముద్రం గర్భంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఇక్కడ అప్పుడప్పుడు భూకంపాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 3.4గా నమోదు కాగా, తాజాగా సంభవించిన భూకం 7.0గా రిక్టర్ స్కేల్‌పై నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 
 
ఈ భూకంపం వలన సునామీ ఏర్పడే పరిస్థితి కనిపించలేదన్నారు. కనుక ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలని తెలిపారు. ఇండోనేసియాలోని నెబె నగరానికి 132 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 547 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభించిందని తెలిపారు. అయితే భూకంపం వల్ల ఎటువంటి నష్టం సంభవించలేదని యూఎస్ జియోలాజికల్ సర్వీసు వెల్లడించింది.