గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2014 (15:45 IST)

కాశ్మీర్‌ను లాక్కుంటాం.. ఒక్క ఇంచ్ కూడా వదలం: బిలావల్

పాకిస్థాన్ తన వంకర బుద్ధిని మరోసారి నిరూపించుకుంది. ఇప్పటికే కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. తాజాగా పాకిస్ధాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత బిల్వాల్ భుట్టో ఏకంగా కాశ్మీర్ అంశంపై కామెంట్స్ చేశారు. 
 
తమ పార్టీ కాశ్మీర్‌ను వెనక్కు తీసుకువస్తుందన్నారు. ఈ మేరకు ముల్తాన్ ప్రాంతంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన బిల్వాల్, "కాశ్మీర్ తిరిగి వెనక్కు తీసుకువస్తాను. ఏ ఒక్క ప్రతి అంగుళాన్ని వదిలిపెట్టం. ఎందుకంటే అది పాకిస్థాన్ లోనిది" అని భుట్టో కుటుంబం వారసుడు అన్నాడు. 2018లో జరగనున్న ఎన్నికల్లో బిల్వాల్ పోటీ చేయనున్నాడు. అదే సమయంలో తన పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా ధీమాగా ఉన్నారు.
 
బిలావల్ ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో పాక్ మాజీ ప్రధానమంత్రులు యూసుఫ్ రజా గిలానీ, రజా పర్వేజ్ అషారఫ్ అతడికి రెండువైపులా ఉన్నారు. 2018లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానని ముందే ప్రకటించిన బిలావల్.. అందుకోసం పాక్ ప్రజలను రెచ్చగొట్టడానికే ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. 
 
వాస్తవానికి అతడి తల్లి బేనజీర్ భుట్టో రెండుసార్లు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆమె తండ్రి జుల్ఫికర్ అలీ భుట్టో 1967లో పీపీపీని స్థాపించారు. బిలావల్ తండ్రి ఆసిఫ్ అలీ జర్దారీ 2008 నుంచి 2013 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.