గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2016 (09:37 IST)

ఆస్ట్రేలియా మహిళకు జికా వైరస్... మరో ముగ్గురికి పరీక్షలు

ఆస్ట్రేలియాలో క్వీన్స్‌లాండ్‌లో నివసించే ఓ మహిళకు జికా వైరస్‌ సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. ఆమెకు విదేశాలలో ఆ వైరస్ సోకిందన్నారు. అందువల్ల జికా వైరస్ వ్యాప్తికి కారణమయ్యే దోమలు ఉండే ప్రదేశానికి వెళ్లరాదని ఆస్ట్రేలియా ప్రభుత్వం గర్భిణులను హెచ్చరించింది. విదేశాల నుంచి వచ్చిన ఆ మహిళకి వైద్య పరీక్షలు నిర్వహించగా.. జికా వైరస్‌ బయటపడింది. దీంతో ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు ముగ్గురికి ఈ వైరస్‌ లక్షణాలు కన్పించినట్లు అధికారులు తెలిపారు. 
 
బ్రెజిల్‌, అమెరికా దేశాల్లో ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇదిలావుండగా, జికా వైరస్ వల్ల జన్మించే శిశువుల్లో కంటిచూపు కూడా దెబ్బతింటుందని నిపుణులు వెల్లడించారు. దోమల ద్వారా వ్యాపించే ఈ వైరస్‌ కారణంగా జ్వరం, దద్దుర్లు వస్తాయి. ముఖ్యంగా తల్లి కాబోతున్న వారిలో, గర్భిణీల్లో ఈ వైరస్‌ లక్షణాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. భారత్‌లో జికా వైరస్ కేసులు ఏవీ నమోదు కాలేదని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా వైద్యాధికారులను హెచ్చరించారు.