2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మిచెల్లీ పోటీ చేయరు: ఒబామా క్లారిటీ

బుధవారం, 30 నవంబరు 2016 (12:08 IST)

obama michelle

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన సతీమణి మిచెల్లీ ఒబామా రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చారు. 2020లో​ జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో  మిచెల్లీ బరిలో ఉండరని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా భార్య మిచెల్లీ 2020 సంవత్సరంలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మిచెల్లీ ఉండరని ఆయన స్పష్టం చేశారు.
 
మిచెల్లీ చాలా ప్రతిభావంతురాలని ప్రజలతో మమేకమై ఉండే వ్యక్తి అయినప్పటికీ.. అధ్యక్ష రేసులో మాత్రం లేరని చెప్పుకొచ్చారు. ఇందుకు కారణం మిచెల్లీకి రాజకీయాలపై ఆసక్తి లేకపోవడమేనని ఒబామా వివరణ ఇచ్చారు. మరోవైపు, అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలిస్తే... మిచెల్లీకి మంత్రి పదవి ఇస్తారనే కథనాలు కూడా గతంలో వెలువడ్డాయి.
 
ట్రంప్ చేతిలో హిల్లరీ ఓడిపోవడంతో... వచ్చే ఎన్నికల్లో మిచెల్లీ పోటీ చేస్తారని కథనాల్లోనూ నిజం లేదని ఒబామా క్లారిటీ ఇచ్చారు. మిచెల్లీకి రాజకీయాలపై.. పదవులపై మోజు లేదని స్పష్టం చేశారు. తన భార్య తెలివైనదని, ఆమెను చూస్తే గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

లాలూ భార్య అంత మాటన్నారే..? సుశీల్ కుమార్ మోదీకి వదినలాంటి దాన్ని.. పరాచికాలు ఆడరాదా?

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నితీష్ ...

news

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. చెన్నైకి భారీ వర్ష సూచన.. దక్షిణ కోస్తా, సీమలోనూ వర్షాలు..

గత ఏడాది డిసెంబరులో భారీ వర్షాలు చెన్నై వాసులను చేదు అనుభవాన్ని మిగిల్చాయి. చెన్నై నగరంలో ...

news

రక్తపిశాచి కావాలనుకుని.. బాయ్‌ఫ్రెండ్ చేత రక్తం తాగించింది..

టీవీల ఎఫెక్ట్‌తో ఏమో గానీ.. అమెరికాలో ఓ యువతి రక్తపిశాచి కావాలనుకుని బాయ్ ఫ్రెండ్‌చే ...

news

టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన జేసీ సోదరులు.. పార్టీ చీఫ్ ఫుల్ సపోర్ట్.. క్యాడర్‌లో అసంతృప్తి..

తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి జేసీ సోదరులకు తలనొప్పిగా మారిపోయారు. వారిద్దరిని కట్టడి ...