శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi

ఉత్తర కొరియాను టార్గెట్ చేసిన ట్రంప్.. అమెరికాపై దాడి చేస్తుందనే భయంతో?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియాను టార్గెట్ చేశారు. సిరియాపై దాడికి అనంతరం ఉత్తర కొరియాకు కళ్లెం వేయాలని ట్రంప్ భావిస్తున్నారు. అణు బాంబులతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఉత్తర కొరియాపై ఆ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియాను టార్గెట్ చేశారు. సిరియాపై దాడికి అనంతరం ఉత్తర కొరియాకు కళ్లెం వేయాలని ట్రంప్ భావిస్తున్నారు. అణు బాంబులతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఉత్తర కొరియాపై ఆకస్మిక దాడులకైనా వెనుకాడవద్దు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆసియా ఖండంలో అస్థిరత్వ చర్యలకు దిగుతుందనే కారణంతో కొరియాపై అమెరికా దాడులకు రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. 
 
ఉత్తర కొరియాపై సైనిక చర్య సహా ఆకస్మిక దాడులకు వెనుకాడరాదని ట్రంప్ యోచిస్తున్నట్లు వైట్ హౌస్ వర్గాల సమాచారం. ఇందుకోసం చైనాను దారితెచ్చేందుకు ట్రంప్ చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే, ఉత్తర కొరియా ఆదివారం నిర్వహించిన క్షిపణి ప్రయోగం విఫలం కావడంతో అమెరికా కాస్త వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.  
 
ఆసియా ఖండంలో అస్థిరత్వ చర్యలకు పాల్పడుతున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కు బుద్ధి చెప్పాలనే పట్టుదలతో ట్రంప్ ఉన్నారు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఉత్తరకొరియా విషయంలో ట్రంప్ తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదని నిపుణుల అంచనా.