శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 12 ఏప్రియల్ 2015 (14:24 IST)

ఐరాసలో శాశ్వత సభ్యత్వం భారత హక్కు : నరేంద్ర మోడీ

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం మరోమారు గళమెత్తారు. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం పొందడం భారత హక్కు అని ఆయన పునరుద్ఘాటించారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న భారత్‌కు ఆ అవకాశం రావాలని కోరారు. పారిస్‌లోని ప్రవాస భారతీయుల విందులో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
అంతకుముందు తన ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా, తొలి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన యుద్ధవీరుల స్మారక స్థూపాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఫ్రాన్స్‌ నేల మీద తొమ్మిది వేల మందికిపైగా యుద్ధవీరులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. 
 
వాళ్ల జ్ఞాపకార్థం స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేశారన్నారు. నేను ఇవాళ ఇక్కడ తలవంచారని... ఆ వీరుల ఆశీర్వాదాలు తీసుకునేందుకు వెళ్లానని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ప్రపంచానికి ఒక సందేశ ఇవ్వాలనుకుంటున్నారని ఆయన అన్నారు. వివిధ దేశాలు భారత్‌ను చూసే విధానాన్ని మార్చుకోవాలని, తమ కోసమే కాదు... ఇతరుల కోసం కూడా భారత్‌ బలిదానాలు ఇస్తుందని మోడీ స్పష్టం చేశారు.